తాలిబన్ రాక్షస పాలనలోకి అఫ్ఘనిస్థాన్.. చీకటి రోజులు మళ్లీ మొదలు, sex బానిసలుగా మహిళలు..
అఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబన్ల శకం మొదలుకావడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. తాలిబన్ల రాక్షస రాజ్యంలో తాము ఎన్ని చిత్రహింసలు అనుభవించాలో తలుచుకుని కుమిలిపోతున్నారు. తాలిబన్ల పాలనలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో తలుచుకుని మహిళలకు నిద్ర కూడా పట్టడం లేదు. ఇప్పటికే ఓ సారి ప్రత్యక్షంగా అనుభవం ఉండటంతో ఈసారి కూడా తమకు కఠిన ఆంక్షలు తప్పవని డిసైడ్ అయిపోయారు.
తమను బలవంతంగా పెళ్లి చేసుకుని సెక్స్ బానిసలుగా మార్చేస్తారని అక్కడి మహిళలు అప్పుడే కుమిలిపోతున్నారు. 12-15 ఏళ్ల వయసు కలిగిన వారు సహా 45ఏళ్లలోపు వితంతువుల జాబితా సేకరించాలని జులై నెలలోనే తాలిబన్ నాయకులు ఆఫ్ఘన్‌లోని మత నాయకులను ఆదేశించారట. బదక్ షాన్, తఖార్ ప్రావిన్స్‌లలోని మత నాయకులకు ఇలాంటి ఆదేశాలు అందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాంటి వారిని తమ తాలిబన్ ఫైటర్లకు వారిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారట. అయితే మత పెద్దలు ఆ లిస్టులను తాలిబన్లకు ఇచ్చారో లేదో తెలియరాలేదు.
తాలిబన్లు ఇలా బలవంతంగా పెళ్లి చేసుకున్న మహిళలను పాకిస్తాన్‌లోని వజిరిస్థాన్‌కు తరలించి మతపరమైన ప్రబోధాలతో ‘రీ-ఎడ్యుకేట్’ చేస్తారని, వారిని ఇస్లామ్ మతంలోకి మార్చి తమ సెక్స్ బానిసలుగా మార్చుకుంటారని తెలుస్తోంది. తాలిబన్ల భయంతో గత 3 నెలల్లో ఆఫ్ఘానిస్తాన్ నుంచి సుమారు 9 లక్షల మంది ఇతర దేశాలకు పారిపోగా.. అక్కడే ఉండిపోయిన వారు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
1996-2001 మధ్య కాలంలో తాలిబన్లు సాగించిన రాక్షప పాలనను అఫ్ఘనిస్థాన్ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎన్నటికీ మరిచిపోలేదు. వారి జీవితాల్లో ఆ ఐదేళ్ల కాలం పీడకలగా మిగిలిపోయింది. మహిళలు విద్య నేర్చుకోకూడదని, బయటికి వస్తే తప్పనిసరిగా ఓ మగ తోడు ఉండాలని, తప్పకుండా బుర్ఖా ధరించాలని ఆంక్షలు ఉండేవి. వాటిని ఉల్లంఘించిన వారిని రాళ్లతో కొట్టడం లేదా కొరడా దెబ్బలతో హింసించి కిరాతకంగా చంపేసేవారు. దీంతో పాటు వేలాది మహిళలను తమ సెక్స్ బానిసలుగా మార్చుకుని రాక్షసానందం పొందేవారు. ఇప్పుడు దేశం మొత్తాన్ని తాలిబన్లు మళ్లీ ఆక్రమించుకోవడంతో ఆ పాత రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవలే ఓ యువతి బిగుతు దుస్తులు ధరించిందన్న కారణంతో తాలిబన్లు కాల్చి చంపేశారు. దీంతో వారి ప్రవర్తనలో గానీ, ఆలోచనా విధానంలో గానీ ఎలాంటి మార్చు రాలేదని, తమకు మళ్లీ చీకటి రోజులు వచ్చినట్లేనని అఫ్ఘాన్ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.