యాలకల “టీ”తో నూతనోత్సాహం.. నీరసాన్ని పోగొట్టి ఆకలినిపెంపొందిస్తుంది

వంటకాలలో సువాసన ద్రవ్యంగా ఉపయోగించబడే యాలకుల్లో ఔషధ గుణాలు నిండుగా వున్నాయి. సువాసన కలిగిన యాలకుల గింజలు కడుపు నొప్పిని నయం చేస్తాయి. జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. ఆయుర్వేద వైద్యంలో ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, కిడ్నీలో రాళ్ళు, ఇంకా బలహీనతను పోగొట్టడంలో యాలకులు ఉపయోగించబడుకున్నాయి. నోటి దుర్వాసనను పోగొట్టడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది.


మానసిక ఒత్తిడికి గురైన వారు యాలకల “టీ” తాగితే ప్రశాంతతను పొందుతారు. టీ పొడి తక్కువగానూ, యాలక్కాయలు ఎక్కువగానూ కలిపి టీ తయారు చేస్తున్నపుడు వెలువడే సువాసనను పీల్చడం ద్వారా వల్ల, ఆ టీ తాగడం వల్ల కలిగే నూతనోత్సాహం వల్ల మానసిక ఒత్తిడి త్వరగా నయమైపోతుందట.


నోటిలో నీరు ఊరడం, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఏర్పడే తలనొప్పి, వాంతులు, ఊపిరితిత్తుల్లో కఫం మొదలైన సమస్యలకి కేవలం యాలుక్కాయలను నోట్లో వేసుకుని నమలడంతోనే నివారణ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నీరసాన్ని పోగొట్టి ఆకలిని పెంపొందించడంలో యాలకులు మెండుగా పనిచేస్తుందని వారు చెప్తున్నారు.

Flash...   మీకు కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు ఉంటాయి.. గమనించండి .. జాగర్త