Afghanistan కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో భయంకర దృశ్యాలు.. విమానం రెక్కలపైకి ఎక్కిన ప్రజలు.


 షాకింగ్‌ వీడియో: విమానం నుంచి కిందపడిన ఇద్దరు అఫ్గన్‌లు



అఫ్గనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌ను తాలిబన్ల ఆక్రమించుకోవడంతో వేలాది మంది
ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు. అక్కడ విదేశీయులు
కూడా తమ స్వస్థలాలకు తరలిపోతున్నారు. ఆదివారం నుంచి కాబూల్ విమానాశ్రయం
కిక్కిరిసిపోయింది. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించగానే రైల్వేస్టేషన్లు,
బస్టాండ్లు కిక్కిరిసిపోవడం.. వాహనాలు ఎక్కేందుకు ప్రజలు ఎగబడినట్టు
ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అలానే ఉంది.
వేలాది మంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు
పెడుతున్నారు.


Also Read: తాలిబన్: చీకటి రోజులు మళ్లీ మొదలు, సెక్స్ బానిసత్వ భయంలో మహిళలు

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అఫ్గన్ దాటేందుకు కూడా వెనుకాడటం లేదు. ప్రజలు
ఒక్కసారిగా విమానాల వద్దకు చొచ్చుకురావడంతో అక్కడ ఉన్న అమెరికా భద్రతా
సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం కాబూల్‌ విమానాశ్రయం తాలిబన్ల
అధీనంలోకి వచ్చిందని అమెరికా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అంతేకాదు అమెరికా దౌత్య ఉద్యోగులను హెలికాప్టర్లలో ఎయిర్‌పోర్టుకు
తరలించింది.

As the Americans leave Kabul: pic.twitter.com/VLYoOrPGZL

— ian bremmer (@ianbremmer) August 16, 2021


కాబూల్ నుంచి బయలుదేరిన అమెరికా విమానం రెక్కలపైకి ఎక్కి ప్రయాణించేందుకు
సిద్ధమయ్యారు. ఇలా విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు జారిపడి ముగ్గురు
చనిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. ప్రయాణికులను అదుపుచేయడానికి కాల్పులు జరపడంతో ఐదుగురు ప్రాణాలు
కోల్పోయారు. దీంతో సాధారణ వాణిజ్య విమానాల ప్రయాణానికి అక్కడి గగనతలాన్ని
మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Also Readతాలిబన్: చీకటి రోజులు మళ్లీ మొదలు, సెక్స్ బానిసత్వ భయంలో మహిళలు


కేవలం సైనిక అవసరాల కోసమే ఎయిర్ స్పేస్ ను వినియోగించుకోనున్నారు. దీంతో
వివిధ దేశాల పౌరుల తరలింపునకు ఆటంకం ఏర్పడింది. అక్కడ భారతీయులను
తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు విమానాలను కాబూల్‌కు పంపాలని అంతకు
ముందు నిర్ణయించింది. సోమవారం రాత్రి 8.30 గంటలకు పంపాలని ముందుగా భావించారు.
పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించి మధ్యాహ్నం 12.30 గంటలకు
పంపించాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఆ గగనతలాన్ని మూసివేయడంతో గత్యంతరం
లేని పరిస్థితుల్లో రెండు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.

Flash...   భారత్ లో అత్యధిక జీతం వచ్చే 10 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే


కాగా, అమెరికా వెళ్లాల్సిన లేదా అక్కడి నుంచి ఢిల్లీకి రావాల్సిన
విమానాలన్నింటినీ ఆఫ్ఘన్ గగనతలం మీది నుంచి కాకుండా దోహా మీదుగా
మళ్లిస్తున్నట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. దోహా హాల్టింగ్‌లో ఇంధనం
నింపుకుని ప్రయాణాన్ని మొదలుపెడతాయని చెప్పాయి. ఇప్పటికే షికాగో నుంచి
వస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. ఇటు అమెరికాతో పాటు వివిధ దేశాలు తమ
పౌరులను తీసుకెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నా ఇప్పుడు
గగనతలాన్ని మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Shocking Videos from Kabul Airport:: కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో అఫ్గనిస్తాన్‌
ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారం తాలిబన్ల వశం కావడంతో అఫ్గన్‌
నుంచి బయట పడేందుకు నానాతంటాలు పడుతున్నారు. అఫ్గన్‌ మీదుగా విమానాల
రాకపోకలపై నిషేధం విధించడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు
కిక్కిరిసిపోయారు. రన్‌వేపై కదులుతున్న విమానం ఎక్కేందుకు వందలాది మంది
ప్రయత్నించారు. విమానం డోర్ క్లోజ్‌ చేసినా వేలాడుతూ ప్రయాణించేందుకు
సాహసించారు. ఈ క్రమంలో టేకాఫ్ అయిన విమానం నుంచి ఇద్దరు అప్గన్‌లు
ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీనికి సంబంధించిన భయానక వీడియోలు సోషల్‌
మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Readఅఫ్గాన్‌లో యద్ధం ముగిసింది.. : తాలిబన్‌ ప్రకటన.

కాగా అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల వశం కావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు
సృష్టిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గనిస్తాన్‌ను
ఆక్రమించడం గమనార్హం. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా
అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గన్‌ రాజధాని
కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక
నగరంలో పాగా వేశారు. 

తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు
నిర్దేశించారు. దీంతో అఫ్గన్‌ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా
అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్‌ ప్రతినిధులు వెల్లడించారు.
అఫ్గన్‌ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తన పదవికి రాజీనామా
చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి
తలదాచుకుంటున్నారు.

Flash...   Changing of Web Options for transfers

Source Video Link

Another Saigon moment: chaotic scenes at Kabul International Airport. No security. None. pic.twitter.com/6BuXqBTHWk

— Saad Mohseni (@saadmohseni) August 15, 2021