AMMA VODI: జగనన్న అమ్మ ఒడి పథకం: అర్హతలు – ప్రయోజనాలు


𒊹︎︎︎ ఈ పథకానికి అర్హులెవరంటే..

తల్లిదండ్రులు, వారి పిల్లలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానికులై ఉండాలి.

✰ ఆయా కుటుంబాల్లోని పిల్లలు ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ స్కూల్స్‌ లేదా రెసిడెన్షియల్‌ లేదా జూనియర్‌ కాలేజీలలోఒకటో తరగతి నుంచి 12వ తరగతిలోపు చదివే విద్యార్థులై ఉండాలి.

✰ ఆయా పాఠశాలలో 75శాతం అటెండెన్స్‌ ఉండాలి.

✰ తెల్ల రేషన్‌కార్డు దారులై ఉండి, దారిద్య్రరేఖకు దిగువ ఉన్నవారై ఉండాలి.

✰ కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5 వేలు, పట్టణాల్లో రూ.6,250 ఉండాలి.

✰ (2021లో కోవిడ్‌ కారణంగా గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఆదాయ పరిమితి ఉండేలా సడలింపు చేశారు)

✰ రెండున్నర ఎకరాల మాగాణి, మెట్ట భూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండాలి

✰ (2021లో కోవిడ్‌ కారణంగా మాగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు)

✰ ఆధార్‌ కార్డు లేదా ఓటర్‌ కార్డు కలిగి ఉండాలి.

✰ విద్యుత్‌ వినియోగానికి సంబంధించి నెలకు 200 యూనిట్లలోపు వాడే వాళ్లు అర్హులు

✰ (2021లో కోవిడ్‌ కారణంగా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు)

✰ మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్థిరాస్థి ఉన్న వారు ఈ పథకానికి అర్హులు

✰ (2021లో 1,000 చదరపు అడుగుల స్థలం ఉన్న వారిని కూడా అర్హులుగా గుర్తించారు)

✰ ఫోర్‌ వీలర్‌ (కారు) ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్న వారికి మాత్రమే మిన హాయింపు ఇవ్వడంతో టాక్సీ ఉన్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులే

✰ (2021లో ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించారు)

✰ పాఠశాల లేదా కళాశాలలో చదివే విద్యార్థులు విద్యాసంవత్సరం పూర్తి చేయకుండా మధ్యలో చదువు మానివేసినా లేదా సక్రమంగా బడికి రాకపోయినా ఈ పథకం వర్తించదు.

మీ స్కూల్ DISE  కోడ్ తో మీ పాఠశాల అమ్మఒడి అర్హుల వివరాలు డౌన్లోడ్ చేసుకోండి

Flash...   AMMA VODI LAUCHING LIVE LINK

✰ కేంద్ర మరియు రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఫెన్షనర్లు ఈ పథకానికి అనర్హులు.

✰ 2021లో పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు.

✰  దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు కూడా అమ్మఒడి వర్తిస్తుంది