AP లో డీఈవోలు, ఆర్జేడీలకు బదిలీ.

 Transfer to DEOs, RJDs ..


 డీఈవోలు, ఆర్జేడీలకు బదిలీ..

పాఠశాల విద్యలో పలువురు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ), జిల్లా విద్యాధికారులను (డీఈవో) ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రకాశం, విజయనగరం జిల్లా విద్యాధికారులతోపాటు మరో ముగ్గురు అధికారులకు ఆర్జేడీలుగా పదోన్నతులను కల్పించింది. ప్రకాశం డీఈవో సుబ్బారావును గుంటూరు ఆర్జేడీగా నియమించగా.. ఇక్కడ పని చేస్తున్న ఆర్జేడీ రవీంద్రనాథ్‌ను కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల కార్యదర్శిగా బదిలీ చేసింది. కాకినాడ ఆర్జేడీగా పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో ఆదర్శ పాఠశాలల జేడీగా ఉన్న మధుసూదన్‌రావును నియమించింది. అక్కడ పని చేస్తున్న ఆర్జేడీ నరసింహారావును సమగ్రశిక్ష అభియాన్‌ కార్యాలయంలో అకడమిక్‌ పర్యవేక్షణ అధికారిగా బదిలీ చేసింది.

 విజయనగరం డీఈవో నాగమణిని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు బదిలీ చేసింది. ఆదర్శ పాఠశాలల విభాగంలో డీడీగా ఉన్న మేరి చంద్రికకు ఇదే విభాగంలో జేడీగా పదోన్నతి కల్పించింది. డైరెక్టరేట్‌లో డీడీగా ఉన్న గీతను రాజమహేంద్రవరం బీఈడీ కళాశాల ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది. ప్రకాశం జిల్లా డీఈవోగా కాకినాడ సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న విజయభాస్కర్‌ను నియమించింది. 


Flash...   AP EAMCET 2023 NOTIFICATION APPLICATION RELEASED