ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది.ఎందుకు?,

 పశ్న: ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది.ఎందుకు?

జవాబు: ఆపిల్‌ పండులో ‘టానిక్‌ యాసిడ్‌’ అనే రసాయనిక ద్రవం ఉంటుంది. మనం ఆపిల్‌ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆ భాగాలకు గాలి తగులుతుంది కదా? అప్పుడు వాటిలోని టానిక్‌ యాసిడ్‌కి, గాలిలోని ఆక్సిజన్‌కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఫలితంగా పాలీఫినాల్స్‌ (poly phenols) అనే పదార్థం ఏర్పడుతుంది. ఆక్సీకరణం (Oxidation) అనే ఈ చర్య వల్ల ఏర్పడే పాలీఫినాల్స్‌ బ్రౌన్‌ రంగులో ఉంటాయి. అందువల్లే ఆపిల్‌ ముక్కలు ఆ రంగులోకి మారతాయి.

అలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ ఆపిల్‌ పండులో ఉండే టానిక్‌ యాసిడ్‌పై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది.

Why do apple slices turn brown after being cut?

When an apple is cut (or bruised), oxygen is introduced into the injured plant tissue. When oxygen is present in cells, polyphenol oxidase (PPO) enzymes in the chloroplasts rapidly oxidize phenolic compounds naturally present in the apple tissues to o-quinones, colorless precursors to brown-colored secondary products.

Flash...   బెర్ముడా ట్రయాంగిల్‌లో నౌకలు మునిగిపోవడానికి కారణం ఏమిటి?