Breaking: తెలంగాణలో రేపట్నుంచి స్కూల్స్ యధాతధం..

 

తెలంగాణ వ్యాప్తంగా రేపట్నుంచి స్కూల్స్ పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెసిడెన్షియల్ మినహా మిగతా అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సర్కార్ అనుమతించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగానున్నాయని స్పష్టం చేసింది.

ఈ మేరకు మార్పులతో కూడిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ వారంలోగా విడుదల చేస్తామని చెప్పింది. అటు ప్రత్యక్ష బోధనపై విద్యార్ధులను బలవంతం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వారంలోగా అన్ని పాఠశాలలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని ఆదేశించింది. కాగా, హైకోర్టు తదుపరి తీర్పు ఇచ్చేవరకు గురుకుల, సాంఘీక, గిరిజన సంక్షేమ హాస్టల్స్ మూసివేయనున్నట్లు స్పష్టం చేసింది.

Flash...   CARONA దరిచేరని ఊరు; అక్కడ ఒక్క కేసూ లేదు..