carona:వూహాన్‌లో క‌రోనా క‌ల‌క‌లం: ప్ర‌జలంద‌రికీ మళ్లీ టెస్టులు…

Carona virus is spreading in China again, and there is a lockdown in capital Beijing. It’s an outbreak that’s growing bigger by the day. It is China’s worst outbreak since March 2020. New clusters are emerging. And China’s ham-fisted response and the desperation to contain the outbreak is beginning to show

2019 డిసెంబ‌ర్‌లో వూహాన్‌లో క‌రోనా మొద‌టి క‌రోనా కేసు వెలుగుచూసింది.  అక్కడి నుంచి క‌రోనా వైరస్ ప్ర‌పంచం మొత్తం వ్యాపించింది.  అయితే, క‌రోనా కట్టడి విషయంలో చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రవాణా వ్య‌వ‌స్థ‌ను స్తంభింపజేసింది.  ప్ర‌జ‌ల‌ను ఇంటికే ప‌రిమితం చేసింది.  ఆ త‌రువాత ఆ న‌గ‌రం మెల్లిగా క‌రోనా నుంచి కోలుకుంది.  అయితే, సంవ‌త్స‌రం త‌రువాత మ‌ళ్లీ వూహ‌న్ క‌రోనా కేసు న‌మోదైంది.  దీంతో ఆ న‌గ‌రంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. 
వూహాన్‌తో పాటు బీజింగ్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆ మాటకొస్తే చైనా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉంది. పైగా చైనాలో జనాభా ఎక్కువ కావడం, వ్యాక్సిన్‌ వేయించుకున్నామన్న ధీమా ఉండడంతో.. అసలుకే ఎసరు పడింది. వ్యాక్సిన్ వేయించుకున్నా సరే డెల్టా వైరస్‌ ప్రతాపం చూపుతోంది. పైగా చైనా వ్యాక్సిన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. చైనా తయారుచేసిన టీకాల సమర్థత ఎంత అన్నది తెలీదు. అయినప్పటికీ, అక్కడి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి టీకాలు వేసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నామన్న ధీమాతో అజాగ్రత్తగా ఉండడంతో చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వైరాలజీ ల్యాబ్ ఉన్న వూహాన్‌కు సైతం చేరింది

సంవ‌త్స‌రం త‌ర‌వాత కేసు న‌మోద‌వ‌డంతో న‌గ‌రంలోని కోటి మంది జ‌నాభాకు మ‌ళ్లీ టెస్టులు నిర్వ‌హించాల‌ని అక్క‌డి అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు.  దీంతో ప్ర‌జ‌ల్లో మ‌ళ్లీ భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.  ఎంత‌మందికి ఇన్ఫెక్ష‌న్లు ఉన్నాయో, ఎంత‌మందిని మ‌ళ్లీ ఐసోలేష‌న్ పేరుతో బందిస్తారో అని భ‌య‌ప‌డుతున్నారు.  చైనాలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి అంటే దాని ప్ర‌భావం మిగ‌తా ప్రపంచ‌దేశాల‌పై ఉండే అవ‌కాశం ఉంటుంది అన‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. 

Flash...   U-DISE date to be update list of Private Aided Institutions as on 03.08.2020