Carona : దేశం లో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు … కేరళలో విలయ తాండవం …

 రెండు నెలల తర్వాత గరిష్ట స్థాయికి కరోనా కేసులు


ఢిల్లీ: దేశంలో మళ్లీ రెండు నెలల తర్వాత ఒకేరోజు అత్యధిక కరోనా కేసులు
వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46, 759 కరోనా కేసులు
నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 32,801 కేసులు నమోదు కావడం గమనార్హం.
దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,26,49,947కు చేరింది. ఇక శుక్ర‌వారం
ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 509 మంది మ‌ర‌ణించ‌గా.. మొత్తం మీద
4,37,370 మంది కరోనాకు బలయ్యారు.

ఇక కరోనా నుంచి 24 గంటల్లో కొత్తగా 31, 374 మంది కోలుకోగా.. మొత్తం
కోలుకున్నవారి సంఖ్య 3,18,52,802గా ఉంది. ఇక దేశంలో 3,59,775 యాక్టివ్‌
కేసులు ఉన్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ
కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 62,29,89,134 డోసుల‌ను
పంపిణీ చేశామ‌ని పేర్కొన్న‌ది. ఇందులో గ‌త 24 గంట‌ల్లో కోటీ 3ల‌క్ష‌ల 35వేల
290 మందికి వ్యాక్సినేష‌న్ వేసి రికార్డు సృష్టించినట్లు కేంద్ర
వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.

బెంబేలెత్తిస్తున్న కేరళ

    * తాజా కేసుల్లో 73.45 శాతం అక్కడే

    * పాజిటివిటీ రేటు 19.22 శాతం

తిరువనంతపురం/న్యూఢిల్లీ:
కేరళలో వరుసగా మూడో రోజూ 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం
31,445 కేసులు, గురువారం 30,007 కేసులు, శుక్రవారం 32,801 కేసులు
నమోదయ్యాయి
. 24 గంటల్లో 1,70,703 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర
ప్రభుత్వం తెలిపింది. టెస్టు పాజిటివిటీ రేటు ఏకంగా 19.22 శాతం నమోదైంది.
శుక్రవారం దేశంలో మొత్తం 44,658 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 32
వేలకు పైగా కేసులు కేరళలోనే నమోదు కావడం గమనార్హం.మొత్తం కేసుల్లో 73.45శాతం
కేసులు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

Flash...   బెల్లం టీ ఇలా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు?

ఇటీవల బక్రీద్, ఓనం వంటి పలు పండుగలు జరిగిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా
చేరడం వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నట్లు అధికారులు
భావిస్తున్నారు. కేరళలో నమోదవుతున్న కేసులు దేశంలో థర్డ్‌ వేవ్‌కు
కారణమవుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌లో శుక్రవారం 44,658 కరోనా
కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య
3,26,03,188కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,44,899కు
పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.03 శాతం ఉన్నాయి. గత 24
గంటల్లో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,36,861కు చేరుకుంది