Corona Cases In India: కేరళలో నో కంట్రోల్ .. భారత్ లో టాప్ 5 రాష్ట్రాలు, తాజా పరిస్థితి ఇదే !!

 

భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. తాజాగా కరోనా కేసులు 40 వేలకు పైనే నమోదవుతున్నాయి. భారతదేశం గురువారం 42,982 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. ఇది దేశంలోని మొత్తం కరోనా కేసులను 32 మిలియన్లకు చేర్చిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. ఈరోజు నమోదైన కేసుల సంఖ్య, బుధవారం నమోదైన కేసుల కంటే 300 కేసులు ఎక్కువ. గత 24 గంటల్లో కోవిడ్ -19 కారణంగా దేశంలో 533 కొత్త మరణాలు సంభవించాయి. భారతదేశంలో మొత్తం మరణాలు 4,26,290 కి చేరాయి. 

పెరుగుతున్న యాక్టివ్ కేసులతో కొత్త ఆందోళన తాజా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి అన్న ఆందోళనల మధ్య వరుసగా రెండవ రోజు, భారతదేశంలో 40,000 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత 24 గంటల్లో దేశంలో యాక్టివ్ కేసులు 700 కి పైగా పెరిగి 4,11,076 కి చేరాయి. ఇది ఇప్పటివరకు దేశంలో చూసిన మొత్తం కేసుల్లో 1.29% గా ఉంది. గత 24 గంటల్లో 41,726 మంది రోగులు కోలుకోవడంతో, దేశంలో జాతీయ రికవరీ రేటు 97.3 శాతానికి చేరుకుంది. దేశంలో కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 30,974,748 గా నమోదయింది. భారతదేశం ఇప్పటివరకు 48.93 కోట్ల కోవిడ్ -19 మోతాదులను నిర్వహించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Flash...   SBI General Suraksha Support Scholarship Program 2021