‘చిటిక’ వేస్తే శబ్దం ఎలా వస్తుంది? ‘How a snap of a finger produce sound ?

ప్రశ్న: మన చేతి బొటనవేలితో, మధ్యవేలితో కలిపి ‘చిటిక’ వేస్తే శబ్దం ఎలా వస్తుంది?

జవాబు: చిటిక అంటే బొటనవేలు మద్యవేలు కలుపుతూ చేసే శబ్ధము..మనం చిటిక వేసినపుడు స్థిరంగా ఉండే బొటన వేలు, కదిలే మధ్యవేలు మధ్య చిక్కుకున్న గాలి ఒత్తిడికి గురవుతుంది. అలా అక్కడ ఎక్కువ పీడనంతో ఉన్న గాలిని చిటికవేయడం ద్వారా తటాలున వదలడంతో శబ్దం వస్తుంది. వూదిన బెలూన్‌ లోపలి గాలి కూడా అత్యంత పీడనంతో ఉంటుంది కాబట్టే ఆ బెలేన్‌ పగిలినపుడు సైతం ‘ఢాం’ అనే శబ్దం వస్తుంది. చిటిక, బుడగల ద్వారా పుట్టే శబ్దాలు ఒత్తిడిలో ఉన్న గాలి వల్ల వచ్చేవే.

Flash...   నిద్ర లో పక్షులు పట్టు జారిపోవు ఎందుకని? Why Birds Do Not Fall From Trees While Sleeping