India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు..

 


India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. 

క్రియాశీల రేటు: 1.15 శాతం.. రికవరీ రేటు: 97.5 శాతం

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసులు సుమారు ఐదు నెలల కనిష్ఠానికి చేరాయి. ముందురోజుతో పోల్చితే 23.5 శాతం మేర తగ్గాయి. అదే సమయంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. తాజాగా మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.

⇒ నిన్న 15,63,985 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 25,166 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.22 కోట్లకు చేరాయి. గత కొద్దికాలంగా కేరళలో నిత్యం 20వేల కేసులు వెలుగుచూస్తుండగా.. తాజాగా అవి 12 వేలకు పడిపోయాయి.

⇒ నిన్న మరో 437 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,32,079కి చేరింది.

⇒ క్రియాశీల కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,69,846 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.15 శాతానికి తగ్గింది.

⇒ రికవరీ రేటు కూడా మెరుగ్గానే ఉంది. తాజాగా 36,830 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.14కోట్లు(97.51శాతం) దాటాయి.

⇒ కరోనా టీకా కార్యక్రమంలో వేగం కనిపిస్తోంది. నిన్న 88,13,919 మంది టీకా వేయించుకున్నారు. జూన్‌ 21 తర్వాత ఆ స్థాయిలో టీకా డోసులు పంపిణీ కావడం గమనార్హం. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 55.47 కోట్లకు చేరింది.

Flash...   దేశంలో ‘తీవ్ర’ స్థాయికి కొవిడ్, ఆ టాప్ 10 జిల్లాలు ఇవే.. కేంద్రం హెచ్చరికలు.