LIC Aadhaar Shila Policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఎన్నో పాలసీలని ఇస్తోంది. దీనితో చక్కటి లాభాలు పొందొచ్చు. అయితే వాటిలో ‘ఆధార్ శిల’ పాలసీ కూడా ఒకటి. ఇక ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ పాలసీతో రోజూ రూ.29 చొప్పున పొదుపు చేస్తే చాలు. రూ.4,00,000 వరకు రిటర్న్స్ పొందొచ్చు. అయితే ఈ పాలసీ కేవలం మహిళలకే. నెలకు రూ.29 చొప్పున 20 ఏళ్ల పాటు పొదుపు చేస్తే చాలు
20 ఏళ్లల్లో చెల్లించిన మొత్తం రూ.2,14,696 అవుతుంది. ఈ పెట్టుబడికి మెచ్యూరిటీ తర్వాత రూ.4,00,000 రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ కనుక పాలసీ హోల్డర్ ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్‌కు 110 శాతం, ఐదేళ్ల తర్వాత మరణిస్తే సమ్ అష్యూర్డ్ మరియు లాయల్టీ అడిషన్ లభిస్తాయి. పాలసీతో పాటు క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్స్ ఉంటాయి.
8 ఏళ్ల నుండి 55 ఏళ్లు వరకు ఎవరైనా ఈ పాలసీ తీసుకొచ్చు. కనీసం 10 ఏళ్లకు పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా 20 ఏళ్లకు పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.3,00,000 సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. పాలసీ ప్రీమియం చెల్లించే ఆప్షన్స్ నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఉంటుంది.
ఉదాహరణకి 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్లకు ఆధార్ శిల పాలసీ తీసుకుంటే.. ఏడాదికి ప్రీమియం రూ.3,709 + ట్యాక్సులు చెల్లించాలి. ఇరవై ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.74,180. మెచ్యూరిటీ తర్వాత రూ.1,00,000 సమ్ అష్యూర్డ్ లభిస్తుంది. అలానే రూ.16,500 లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది. అంటే మొత్తం రూ.74,180. చెల్లిస్తే రూ.1,16,500 వస్తాయి.