PRC పై మార్గసూచీ ఎలా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశం HIGHLIGHTS

 🔸పీఆర్సీపై మార్గసూచీ ఎలా?

🔸నిధులు ఎంత అవసరం? ఎలా సర్దుబాటు చేయాలి

🔸 లెక్కలు సిద్ధం చేసుకోవాలి*

🔸 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశంలో చర్చ

🔸 వారం, పది రోజుల్లో మరోసారి భేటీ

ఆగస్టు 14: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై ఉన్నత స్థాయిలో కసరత్తు మొదలయింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కార్యాలయంలో పీఆర్సీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కంట్రిబ్యూటరీ పింఛను పథకం అంశాలపై ఆదిత్యనాథ్ దాస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో సీసీఎల్ఏ డైరెక్టర్ నీరవ్ కుమార్ ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్,సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, డీజీపీ గౌతం సవాంగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. 

పీఆర్సీ అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ప్రభుత్వ నేతలకు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి ఈ సమావేశం నిర్వహించారు. పీఆర్సీ అమలుపై మార్గసూచీ ఎలా అన్నదానిపై చర్చించారు. ప్రస్తుతం రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఏమిటి? పీఆర్సీని ఏ స్థాయిలో ఏమి అమలు చేస్తే ఎంత భారం పడుతుంది వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.  పీఆర్సీ అమలుకు నిధులు ఎలా సర్దుబాటు చేసుకోవాలి వంటి అంశాలపై ఆర్థికశాఖ అభిప్రాయం కోరగా వివరాలు సిద్ధం చేయడానికి మరో వారం రోజులు గడువు కోరినట్లు సమాచారం.  

ఈ నేపథ్యంలో మరో వారం పదిరోజుల్లో మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. పీఆర్సీపై మంత్రివర్గానికి తగిన సిఫార్సులు చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఒకవైపు ఆర్థిక శాఖ సన్నద్ధం కావడంతో పాటు కార్యదర్శుల కమిటీ కూడా త్వరలో భేటీ అవుతుందని తెలిసింది.  ఈ కమిటీ కూడా మంత్రివర్గానికి సిఫార్సులు చేయడానికి కసరత్తు చేసి నివేదిక సిద్ధం చేయ బోతున్నట్లు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే ఎంత భారం పడుతుందన్న దానపైనా చర్చ జరిగినట్లు తెలిసింది

Flash...   ELECTRIC VEHICLES: జనవరి 1 నుండి EV వాహనాలు కొనే ఆ కంపెనీ ఉద్యోగులకు రూ.3 లక్షల ఆఫర్!