Single-dose Vaccine జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు భారత్ ఆమోదం.. త్వరలో మరో టీకా..

దేశంలో మరో కోవిడ్ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఫార్మ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం పొందింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాజాగా టీకాతో భారత్‌లో అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన వ్యాక్సిన్ల సంఖ్య ఐదుకు చేరిందని అన్నారు. ఇది కోవిడ్-19కు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న సమిష్టి పోరాటానికి మరింత బలాన్నిస్తుందని మాండవీయ పేర్కొన్నారు.

బయోలాజికల్ ఈ లిమిటెడ్ సహకారంతో భారతీయులకు సింగిల్-డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ముఖ్యమైన మైలురాయి అని జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ సమర్థత, భద్రతా డేటాపై ఆధారపడి అత్యవసర వియోగానికి ఆమోదం ఆధారపడి ఉంది.. మా సింగిల్-డోస్ వ్యాక్సిన్‌పై అన్ని ప్రాంతాలలో నిర్వహించిన అధ్యయనాల్లో తీవ్రమైన వ్యాధిని నివారించడంలో 85 శాతం ప్రభావవం చూపింది. టీకా తీసుకున్న 28 రోజుల తర్వాత ఆసుపత్రిలో చేరడం, మరణాల ముప్పును తగ్గించింది’ అని పేర్కొంది.

డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియాకు శుక్రవారం జాన్సన్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. గతంలో సంస్థ భారత్‌లో ట్రయల్స్ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకుని..దానిని ఉపసంహరించుకున్న విషక్ష్ం తెలిసిందే. పలు దేశాల్లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం పొది. దీంతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ లేకుండానే..అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.

Flash...   YOUR WHATS APP NUMBERS IN GOOGLE SEARCH