తాజ్ మహల్ నిజాలు !
తాజ్ మహల్ ను మొగల చక్రవర్తి తన భార్య ముంతాజ్ పై ప్రేమ చిహ్నం గా నిర్మించాడు. అపురూపమైన ఈ కట్టడాన్ని నిర్మించడానికి సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది. సుమారు 22,000 మంది పనివారు తాజ్ మహల్ నిర్మాణంలో పని చేసారు. ఈ నిర్మాణం వివిధ దశలలో చేసారు.
తెల్లని పాల రాయి తో నిర్మించబడిన తాజ్ మహల్ ఇండియా లో తప్పక మరోమారు కూడా దర్శించదగిన పర్యాటక ఆకర్షణ. తాజ్ మహల్ కు నిర్మించబడిన స్తంభాలు, ఆ కట్టడం ఏ రకమైన ప్రకృతి విపత్తు కు ధ్వంసం కాకుండా నిర్మించారు. ఈ నిర్మాన్ని సపోర్ట్ చేసే నాలుగు స్తంభాలు కూడా బయటకు వాలి వుంటాయి
తాజ్ మహల్ నిర్మాణంలో నాలుగు శిల్ప శిలులను ఆచరించారు. పర్షియన్, తర్క, ఇండియన్ మరియు ఇస్లామిక్ స్టైల్స్ అన్నీ కలిపి తాజ్ మహల్ నిర్మాణం ఏర్పడింది.
కధనాల మేరకు యమునా నదికి ఆవలి ఒడ్డున తాజ్ మహల్ ను పోలిన మరొక తాజ్ మహల్ నలుపు రంగులో నిర్మించ కోరినట్లు కూడా చెపుతారు. అయితే, తన కుమారుడు ఔరంగా జేబ్ ఆయనను చెరసాలలో పెట్టిన కారణంగా షా జహాన్ ఆ పని చేయ లేకపోయాడు.
ఆగ్రాలోని తాజ్ మహల్ స్మారక నిర్మాణం లోపల ఉంచిన షాజహాన్ మరియు ముంతాజ్ యొక్క రెండు సమాధులు తప్ప మిగిలిన నిర్మాణం సమ రూపతలో ఒకే విధంగా నిర్మించబడింది.
చక్రవర్తి మరియు ఆయన భార్య ముంతాజ్ ల సమాధులు ప్రజలకు బయటకు కనపడవు. సందర్శకులు చూసే ప్రాకారం లోపలి భాగంలో అవి వుంటాయి. ఈ సమాధులు ఉపరితలం నుండి 7 అడుగులు లోతులో వుండి ఒక మెటల్ డోర్ తో లాక్ చేయబడి వుంటాయి
నిర్మాణం యొక్క మెయిన్ డోర్ పై కురాన్ లోని శ్లోకాలు వుంటాయి. ముంతాజ్ సమాధి ఇరుపక్కలా అల్లా కు గల 99 పేర్లను చెక్కారు.
Inside view of Tamahal
తాజ్ మహల్ గురించిన ఈ కధ అందరికీ తెలిసిందే. కానీ, ఎక్కువమందికి తెలీని మరో నమ్మలేని నిజం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముస్లింలు తమ పాలనలో వందలాది హిందూ దేవాలయాలను కూలగొట్టారు. కొన్నిటిని నామరూపాల్లేకుండా చేసి, ఇంకొన్ని భవనాలను మసీదులుగా, ఇస్లామిక్ నిర్మాణాలుగా మార్చేశారు. అందుకు అయోధ్య లోని రామజన్మభూమి, మధురలోని కృష్ణాలయం రెండు ఉదాహరణలు మాత్రమే. నిజానికి అలాంటివి ఇంకెన్నో ఉన్నాయని, తాజ్ మహల్ కూడా అలా మార్చి కట్టినదే అని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయి.
షాజహాన్ కు భార్య ముంతాజ్ మీద అంతులేని ప్రేమ అనడాన్ని నమ్మలేం. ఎందుకంటే, ఒక వ్యక్తికి ఒకరి మీద మాత్రమే ప్రేమ కలిగితే అది నిజాయితీతో కూడింది. పవిత్రమైంది. అపురూపమైంది. అంతే తప్ప అనేకమందిమీద ఏకకాలంలో ప్రేమ అంటే… అంతకంటే బూటకం ఉండదు. పైగా షాజహాన్ కుడజనుకు పైగా భార్యలే కాకుండా 500 మంది స్త్రీలతో సంబంధం ఉండేదని, ఆఖరికి సొంత కూతురితో కూడా రిలేషన్ పెట్టుకున్నాడని, పైగా దాన్ని సమర్ధించుకుంటూ “తోటమాలికీ తాను నాటిన ప్రతి చెట్టు కాయనూ రుచి చూసే హక్కు ఉంటుందని” వాదించేవాడని అంటారు. ఇంత చంచల
మనస్కుడు ముంతాజ్ కోసం పనిమాలా తాజ్ మహల్ ను కట్టించాడు అనేది నమ్మశక్యం కాని సంగతి.
షాజహాన్ వ్యక్తిగత తీరు సంగతి అలా ఉంచితే, ప్రసిద్ధ చరిత్రకారుడు పీ.ఎన్. ఓక్ ”తాజ్ మహల్” నిజానికి హిందూ శివాలయం అని, దాని అసలు పేరు ”తేజో మహాలియా” అని చాటుతూ అనేక ఆధారాలతో ”Taj Mahal – The True Story” పేరుతో ఎప్పుడో 1965లోనే గ్రంధం రాశారు.
తాజ్ మహల్ మొదట “తేజో మహాలియా” అని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. ఔరంగజేబు పర్షియన్ భాషలో షాజహాన్ కు రాసిన ఒక లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్ మహల్ గా మార్చినట్లు రాశాడంటూ పీ. ఎన్. ఓక్
http://rbhatnagar.ececs.uc.edu:8080/hindu_history/modern/taj_oak.html
ఉటంకించారు.
కానీ అప్పట్లో ప్రభుత్వం ”Taj Mahal – The True Story” పుస్తకాన్ని నిషేధించడంతో అందులో ఉన్న సమాచారం ఎవరికీ తెలీకుండా పోయింది. మత కలహాలు చెలరేగకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. కానీ, నిజానిజాలు ప్రజలకు
తెలియాల్సిన అవసరం ఉంది కదా!
ఏమైతేనేం, భారతీయ, ఇస్లాం, పర్షియన్ వాస్తు సమ్మిశ్రితంగా నిర్మించిన తాజ్ మహల్, 400 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శోభాయమానంగానే ఉంది. తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేలమంది వాస్తు కళాకారులు, శిల్పులు, ఇతర పనివాళ్ళు పాల్గొన్నారు. ప్రపంచ వింతల్లో ఇదొకటి. భారతమాతకు ఇదో సుందర కళాభరణం. 1983లో యునెస్కో “ప్రపంచ పూర్వా సంస్కృతి ప్రదేశం“గా తాజ్ మహల్ ను గుర్తించింది.
Also Read:
1.మెక్సికో లోని చిచెన్ ఇట్జా (క్రీ.శ. 800)
No one has ever challenged it except Prof. P. N. Oak, who believes the whole world has been duped. In his book Taj Mahal: The True Story, Oak says the Taj Mahal is not Queen Mumtaz’s tomb but an ancient Hindu temple palace of Lord Shiva (then known as Tejo Mahalaya ). In the course of his research Oak discovered that the Shiva temple palace was usurped by Shah Jahan from then Maharaja of Jaipur, Jai Singh.
Read More : https://indusscrolls.com/shocking-evidences-of-why-taj-mahal-is-a-hindu-temple-video/