THIRD WAVE ; పిల్లలకు ప్రమాదం ఉండదు, ఆగస్ట్ చివరిలోనే ఆరంభం : మిచిగాన్ వర్సిటీ అధ్యయనం

.

భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ పై ఆందోళన కొనసాగుతోంది. ఈ నెలలోనే మరోమారు కొవిడ్-19 ఉద్ధృతి మొదలు కానుందని వివిధ పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం సామాజిక దూరి నిబంధనలు పాటించడం చెయ్యాలని, వ్యాక్సిన్లు తీసుకోవాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ అనివార్యమే అయినప్పటికీ దాని తీవ్రతను తగ్గించడంలో ప్రజల దే కీలక పాత్ర అని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా కొత్త కేసుల మధ్య హెచ్చుతగ్గుల ఊగిసలాట కొనసాగుతోంది. కరోనా క్షీణిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్న మరోవిధంగా కరోనా థర్డ్ వేవ్ ఆందోళన కలిగిస్తుంది.

ఆగష్టు చివరి వారంలో థర్డ్ వేవ్ .. క్రమంగా పెరుగుదల ఇదిలా ఉంటే తాజాగా మిచిగాన్ విశ్వవిద్యాలయం యొక్క మోడలింగ్ ప్రొజెక్షన్ ఆగష్టు చివరి వారంలో భారతదేశం మరో తరంగం దిశగా వెళుతున్నట్టు చూపిస్తోందని వెల్లడించింది. అయితే నవంబరు నెలలో పీక్స్ కు చేరే అవకాశం ఉందని మిచిగాన్ విశ్వవిద్యాలయం యొక్క మోడల్ స్పష్టం చేసింది. ప్రతిరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, సమర్థవంతమైన పునరుత్పత్తి రేటు ఆర్ విలువ ఒకటి కంటే ఎక్కువ గా నమోదవుతున్న నేపథ్యంలో అనేక మోడలింగ్ అంచనాలు భారతదేశంలో కరోనా థర్డ్ వేవ్ పై అలర్ట్ చేస్తున్నాయి.

Flash...   ఆంధ్రజ్యోతి MD V.రాధాకృష్ణకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ