War Is Over : అఫ్గాన్‌లో యద్ధం ముగిసింది.. : తాలిబన్‌ ప్రకటన


ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించారు. వారు నిన్న రాజధాని కాబుల్‌ను ఆక్రమించిన విషయం తెలిసిందే. అనంతరం అధ్యక్ష భవనాన్ని ఆధీనంలోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా తాలిబన్‌ రాజకీయ కార్యాలయ ప్రతినిధి మహమ్మద్‌ నయీమ్‌ అల్‌జజీరా టీవీతో మాట్లాడుతూ ‘‘ఈ రోజు అఫ్గాన్‌ ప్రజలు, ముజాహిద్దీన్‌లకు చాలా గొప్పది. వారి 20 ఏళ్ల త్యాగఫలాలు నేడు అందాయి. భగవంతుడికి ధన్యవాదాలు. దేశంలో యుద్ధం ముగిసింది’’ అని పేర్కొన్నారు.

కొత్త పాలనపై మరికొన్ని రోజుల్లో తాలిబన్లు స్పష్టత ఇస్తారని నయీమ్‌ వెల్లడించారు. అంతేకాదు అఫ్గానిస్థాన్‌ శాంతి యుతంగా అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటోందని  పేర్కొన్నారు. ఏ దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఎవరినీ వాడుకోనీయమని పునరుద్ఘాటించారు.

దేశ రాజధాని కాబుల్‌ స్వాధీనానికి వారికి కనీసం వారం రోజులు కూడా పట్టలేదు. అమెరికా వేల కోట్ల డాలర్లు ధారపోసి అఫ్గాన్‌ సైనికులకు ఇచ్చిన శిక్షణ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది. వారు కనీస పోరాటం కూడా చేయకుండా రాజధానిని అప్పజెప్పారు. సోమవారం ఉదయం అమెరికా దౌత్యకార్యాలయం దీనిపై కీలక ప్రకటన చేసింది. అమెరికా రాయబారి రోస్‌ విల్సన్‌ సహా కీలక ప్రతినిధులను విమానాశ్రయానికి తరలించింది. వారిని అతి త్వరలోనే అఫ్గాన్‌ నుంచి బయటకు తీసుకెళ్లనుంది.

Flash...   Notification for WARD/VILLAGE SECRETARIAT Departmental Tests