పాఠశాలలకు పాత పని వేళలే

 అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలు 2021-22లో నిర్వహించాల్సిన అంశాలతో విడుదల చేసిన విద్యాక్యాలెండర్లో పేర్కొన్న సమయాలు టీచర్లందరికీ వర్తించేవి కావని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీ ఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాపరెడ్డి గురువా రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 నుంచి 8.45 గంటల వరకు సెల్ఫ్ స్టడీ తది తరు సహ పాఠ్యకార్యక్రమాలు విద్యార్థులు, టీచర్ల ఐచ్ఛికం ప్రకారమే నిర్వహించుకోవచ్చని తెలి పారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నిర్దేశించిన విద్యార్ధుల సెల్ఫ్ స్టడీ, సవరణాత్మక బోధన వంటివి కూడా ఉపాధ్యాయులు, టీచర్ల ఐచ్ఛికానుసారమే నిర్వహించుకోవచ్చని పేర్కొ న్నారు. ఇతర టీచర్లకు స్కూళ్ల రెగ్యులర్ సమ యాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే ఉంటుందని, ఈ అంశాలను క్యాలెండర్లో స్పష్టంగా పేర్కొన్నా మని తెలిపారు. ఇలా ఉండగా పాఠశాలల పని వేళలు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంట ల వరకు నిర్ణయించడం అశాస్త్రీయమని యూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్వెంక బేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సమయాలను మార్చాలని డిమాండ్ చేశారు.

ఈనాడు డిజిటల్, అమరావతి, పాఠశాలల పని వేళల్లో మార్పు లేదని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృ ష్ణారెడ్డి ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూ లపు సురేష్ తో మాట్లాడారని చెప్పారు. అన్ని పాఠశా లలు ఇప్పటిలాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతా యని మంత్రి తెలిపారని వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

Flash...   TELUGU 6 - 10 CLASSES LESSON PLANS