రెండు పాఠశాలల్లో బోధించాల్సిందే

SA టీచర్లు అటుఇటూ మారాల్సిందే

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో 

పాఠశాల విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉపాధ్యాయులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఎ) క్యాడర్ ఉపాధ్యాయులు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు మారుతూ బోధించాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయి. 3, 4, 5 విద్యార్థుల తరగతులను ఉన్నత పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు ఉన్నత పాఠశాలల్లో లేని పరిస్థితి నెలకొంది. 

ఈ విద్యా సంవత్సరం మొత్తం 3,627 ప్రాథమిక పాఠశాలలను తరలించనున్నారు. ఒక్కో ఉన్నత పాఠశాలకు 3-4 ప్రాథమిక పాఠశాలల విద్యార్ధులు వెళ్లాల్సి ఉంది. సుమారు 60-80 మంది విద్యార్ధులకు తప్పనిసరిగా మూడు తరగతి గదులు అవసరముంది. అయితే సరిపడా గదులు ఉన్నత పాఠశాలల్లో లేవు. దీంతో ఉపాధ్యాయులనే అటుంటూ తిప్పాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరం వరకు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలల్లోనే బోధన జరగనుంది. ఈ తరగతులు ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యేక గదుల్లో కూర్చోబెడతారు. వీరికి పిరియడ్స్ వారి టైమ్ టేబుల్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎసిటి టీచర్లు సరిపడా ఉంటే వారితో బోధిస్తారు. వారిపై బోధన భారం పడుతుందనుకుంటే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులతో కూడా వీరికి బోధిస్తారు. తరలించాలనుకుంటున్న 3,627 పాఠశాలల్లో ఎక్కువగా 1-2 ఎస్టి టీచర్లతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. 

ఈ ఉపాధ్యాయులు 1, 2 తరగతులు బోధించేందుకు. సరిపోతారు. కాబట్టి 3, 4, 5 తరగతులకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లు తప్పకుండా రావాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించిన స్కూల్ అసిస్టెంట్లు మళ్లీ ఉన్నత పాఠశాలలకు వెళ్లి మిగిలిన 6,7,8 తరగతులకు న బోధించాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో నాడు- నేడు ఆ కార్యక్రమానికి మొత్తం రూ.16 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 1 ఖర్చు పెడుతోంది. ఇప్పటికే మొదటి దశ ద్వారా రూ.4,600 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఒక్క తరగతి గదినీ ‘అదనంగా నిర్మించలేదు. ఇప్పుడు ఉన్నత పాఠశాలల్లో “అవసరమైన తరగతి గదులను నాడు-నేడు ద్వారా చేపడతామని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది.

Flash...   Schedule for conduct of elections to reconstitute the Parents Committees in the State