విద్యార్థుల అడ్మిషన్లలో ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగించాలి.

ఆగస్టు 19 –  పాఠశాల విద్య అడ్మిషన్లలో ఏర్పడ్డ సాంకేతిక సమస్యలు తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు జోసెఫ్ సుధీర్ బాబు, వి.శ్రీనివాసరావు తదితరులు కోరారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ కు గురువారం లేఖ రాశారు.   రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పాఠశాలలు ఆగస్టు 16వ నుంచి ప్రారంభమయ్యాయని, పాఠశాల అడ్మిషన్లో అనేక ఇబ్బందులు ఏర్పడి ఆన్ లైన్ లో నమోదు కావడం లేదన్నారు. విద్యార్థులకు పుట్టు మచ్చలు, బ్లడ్ గ్రూపు, ఎస్సీ, బీసీ ఉప కులాలు ఆన్ లైన్ లో నమోదు కావటం లేదన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

బ్లడ్ గ్రూపు విషయంలో తల్లిదండ్రులు వివరాలు ఇవ్వడం లేదని, తామే ఆ పరీక్ష చేయించాల్సి వస్తోందని వారు తెలిపారు. ఇందుకు రూ.150 వరకు విద్యార్థికి ఖర్చవుతోందని వివరించారు.   బీసీ, ఎస్సీ ఉపకులాల జాబితా కూడా లేనందున నమోదు  పక్రియకు  ఆటంకంగా  ఉందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించి  పోర్టల్ లో అవసరమైన మార్పులు చేయాలని కోరారు.

Flash...   Termination of services of teachers of DSC-2008 appointed on Minimum Time Scale for this year 2021-22