నాడు నేడు పనుల్లో అంతా మోసం ; వీడియో వైరల్

 నాడు నేడు పనుల్లో అంతా మోసం ; వీడియో వైరల్ .. విద్యా శాఖామంత్రి ఇలాకాలో  ఘటన !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునరుద్ధరణ కొరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నడుంబిగించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన పాఠశాలల రూపురేఖలు మార్చిన నాడు నేడు పనులపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి . రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న నాడు-నేడు పనుల నిర్వహణలో పారదర్శకత లేదని, నాడు నేడు పనులు అంతా మోసమని, ఈ పనులలో కాంట్రాక్టర్లదే హవా అని సెల్ఫీ వీడియో చేసి మరి సంచలన ఆరోపణలు చేశారు.

ఎర్రగొండపాలెం నియోజకవర్గం గుర్రపు శాల ఎంపీపీ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బద్దెగం సుబ్బారెడ్డి చేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. అధికార వైసీపీ కి చెందిన ఓ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి నాడు నేడు పనులకు బిల్లులు చెల్లింపు సక్రమంగా జరగడం లేదని నాడు నేడు పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయి అంటూ సెల్ఫీ వీడియో తీస్తూ ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత ఇలాకాలోనే విద్యా శాఖకు సంబంధించిన నాడు నేడు పనులలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

తనకు రావాల్సిన బిల్లులు ఇవ్వకుంటే ఆ ఎన్నికలు బహిష్కరిస్తామని వెల్లడి ఈ సెల్ఫీ వీడియోలో బద్దెగం సుబ్బారెడ్డి నాడు నేడు పనులకు సంబంధించి తనకు రావలసిన బిల్లులు రాని విషయాన్ని ప్రస్తావించారు. పాఠశాల హెడ్మాస్టర్ కు చెప్పినా స్పందించలేదని, అధికారులు, తమ ఎమ్మెల్యే అయిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కి చెప్పినా ఫలితం లేదని ఆయన వాపోయారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన సుబ్బారెడ్డి జగన్ అనుకున్నట్లు నాడు-నేడు పనుల్లో పారదర్శకత లేదని తెలిపారు. నాడు నేడు పనులన్నీ కాంట్రాక్టర్లు చేస్తున్నారని, అందులో తాను చేసిన కొద్దిపాటి పనుల బిల్లులు ఆగిపోయాయని పేర్కొన్న ఆయన, తన బిల్లులు చెల్లించకుంటే ఈనెల 22వ తేదీన జరగనున్న తల్లిదండ్రుల కమిటీ ఎన్నికను బహిష్కరిస్తామని పేర్కొన్నారు.

Flash...   45 ఏళ్ళు దాటిన వారికే VACCINATION .. స్ప‌ష్టం చేసిన CABINET..!