సర్వీస్ రూల్స్ పరిష్కారానికి ప్రత్యేక చొరవ

• సర్వీస్ రూల్స్ పరిష్కారానికి ప్రత్యేక చొరవ

• దసరాలోపు అన్ని కేడర్లకు పదోన్నతులు

• పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు

ఫ్యాప్టోతో చర్చలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్పై ట్రిబ్యునల్లో ఉన్న కేసుపై ప్రత్యేక చొరవ చూపిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. లేదంటే నూతన రూల్స్ రూపొందించి దసరా సెలవుల్లోపు అన్ని కేడర్ల పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని తన కార్యాలయంలో ఫ్యాప్టా నాయకులతో గురువారం ఆయన చర్చలు జరిపారు. పాఠశాలల్లో ఉన్న యాప్లపై విద్యాశాఖ మంత్రి, ముఖ్యకార్యదర్శులతో చర్చించి పరిష్కారం చూపుతామని వెల్లడించారు. అప్గ్రేడ్ పాఠశాలలకు 400 ప్రధానోపాధ్యాయులు పోస్టులు త్వరలో మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఈ అకడమిక్ విద్యాసంవత్సరంలో అన్ని సెలవులను యధాతధంగా వాడుకోవడానికి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 2002 పదోన్నతుల టీచర్ల సర్వీస్ అంశాన్ని పరిష్కారిస్తామని తెలిపారు. వేసవిలో నాడు నేడు పనులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఇఎల్స్ మంజూరుకు త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు ఆగస్టు నుంచి రూ.6వేలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న క్రాఫ్ట్, డ్రాయింగ్ టీచర్ల బదిలీలను మూడు రోజుల్లో పూర్తిచేస్తామని తెలిపారు.

 త్వరలో మండల విద్యాశాఖ అధికారుల బదిలీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిర్ణయించిన ఉత్తమ ఉపాధ్యాయ ఆవార్డులు అందిస్తామని, వాయిదా వేయలేదని చెప్పారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయు లపై దాడులు చేస్తున్న అగంతకులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని ప్రతిపాదనలు పంపాలని ఫ్యాప్టో నాయకులు కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో ఎస్ సింజర్ డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి, ఫ్యాన్లో చైర్మన్ సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, సెక్రటరీ జనరల్ సిహెచ్ శరత్ చంద్ర, వైద్యష్ న్కూ వెంకటేశ్వర్లు, వి శ్రీనివాసులు, ఎపి జెఎసి సైక్రటరీ జనరల్ జి హృదయరాజు భార్యవర్గం సభ్యులు ప్రసాద్, ఏ. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Flash...   విద్యార్థులు ట్యాబ్‌ల్లో సినిమాలు చూడడంపై ఉపాధ్యాయులకు మెమోలు!