మల్టీజోన్‌ పోస్టుగా జడ్పీ హెచ్‌. ఎం: TS

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌-2 పోస్టును కూడా ఎట్టకేలకు మల్టీజోన్‌లోకి మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌-1, గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌-2 పోస్టులను మల్టీజోన్‌కు మారుస్తూ జీఓ నెంబర్‌ 255ను జారీ చేశారు. కానీ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోని గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌-2 పోస్టును అటు లోకల్‌ కేడర్‌లో, ఇటు మల్టీజోన్‌లో పెట్టకుండా వదిలేశారు. ఆ పోస్టును కూడా మల్టీజోన్‌లో పెట్టాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కోరారు. దాంతో ఆ పోస్టును కూడా మల్టీజోన్‌లో చేర్చారు.

Flash...   Black Lips: నల్లటి పెదాలతో బాధపడుతున్నారా.. ఈ ఆయిల్‌ వాడితే బెస్ట్‌ రిజల్ట్‌..!