శానిటేషన్’ నుంచి టీచర్లను మినహాయించాలి

 ‘శానిటేషన్’ నుంచి టీచర్లను మినహాయించాలి

ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక సాక్షి, అమరావతి: అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్ బాధ్యతలు, జగనన్న గోరుముద్ద ఫొటోలు తీసే బాధ్యతల నుంచి టీచర్లను మినహాయించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక (ఫోర్టో) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు. శ్రీనివాసుల రెడ్డి, చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ సామల సింహాచలం శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 31వ తేదీన టీచర్లంతా రోజూ రొటేషన్ పద్ధతిలో టాయిలెట్ల ఫొటోలు, మధ్యాహ్న భోజన పథకం ఫొటోలు తీసి యాప్లలో అప్లోడ్ చేయాలని ఇచ్చిన మెమో నం.789ను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. టీచర్ల చేత చదువు చెప్పించాల్సింది పోయి టాయిలెట్లు, భోజనం ఫొటోలు తీయమనడం విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకమని, వెంటనే ఆ బాధ్యతల నుంచి టీచర్లను మినహాయించకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు.

Flash...   ఫ్యూచర్‌ ఫోన్లు ఇవే..చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!