55 శాతం ఫిట్ మెంట్ తో అక్టోబర్ మొదటి వారంలో PRC

      • ఐదు డీఏల బకాయిలు విడుదల చేయాలి 
      • కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరించాలి 
      • సచివాలయ ఉద్యోగులను బేషరతుగా క్రమబద్ధీకరించాలి
      • ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు డిమాండ్
      • సీపీఎస్ రద్దు చేయాలి
      • ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కెవీవీ శివారెడ్డి డిమాండ్



సెప్టెంబరు 11: PRC ని  55 % ఫిట్ మెంట్ తో తక్షణం
ప్రకటించాలని, 5  డీఏల బకాయిలు తక్షణం విడుదల చేయాలని  APNGO    రాష్ట్ర  అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు  శనివారం డిమాండ్ చేశారు.
ఏపీన్జీవో రాష్ట్ర నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టిన తర్వాత అసోసియేషన్
సభ్యులంతా శనివారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చారు . 


అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి
శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ
ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే 55శాతం ఫిట్మెంట్తో మెరుగైన పీఆర్ సీ
ప్రకటించాలని డిమాండ్ చేశారు . కొన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఉద్యోగుల
జీతాలకు బడ్జెట్ తో ముడి పెట్టకుండా ఒకటో తేదీనే జీతాలు చెల్లించేలా ముఖ్యమంత్రి
చొరవ చూపాలని కోరారు . అన్ని అర్హతలతో సచివాలయ ఉద్యోగులుగా చేరిన వారికి అక్టోబర్
2 నాటికి మళ్లీ పరీక్షలు  నిర్వహించడం సరికాదని , రూల్ ఆఫ్ రిజర్వేషన్
ప్రకారం సర్వీసు కమిషన్ నిబంధనలతో ఉద్యోగాల్లోకి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు
బేషరతుగా పూర్తి స్థాయి హోదా కల్పించాలని డిమాండ్ చేశారు . అవసరమైతే డిపార్ట్
మెంటల్ పరీక్షలు నిర్వహించి వారికి పదోన్నతులు కల్పించాలే తప్ప , అన్ని అర్హతలతో
ఉద్యోగాలు పొందిన వారికి రెండు సంవత్సరాలు పూర్తెనందున తిరిగి పరీక్షలు
నిర్వహించడం సరికాదన్నారు. 


పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులు , పెన్షనర్ల ప్రయోజనాలు పరిరక్షిస్తూ 5
పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు . ఇప్పటి వరకు ఎరియర్స్
పెండింగ్లోనే ఉన్నాయని , ఎటువంటి డిఏ చెల్లించకుండానే పెన్షనర్లు , సర్వీసు
ఉద్యోగుల నుంచి ఇన్ కం టాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. 

Flash...   Intermediate Advanced Supplementary Examinations August 2022 Schedule


ఉద్యోగులకు సెప్టెంబర్ నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలో 55 శాతం ఫిట్ మెంట్ తో
మెరుగైన పీఆర్ సీ ప్రకటించి బకాయి డీఏలను విడుదల చేయాలని , కాంట్రాక్టు ఉద్యోగుల
సర్వీసులను క్రమబద్ధీకరించాలని  సచివాలయ ఉద్యోగులను బేషరతుగా విధుల్లోకి
తీసుకోవాలని ఏపీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు , జిల్లా
జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాంలు కోరారు . అనంతరం ఏపీఎన్జీవో ఆధ్వర్యంలో నూతన
అధ్యక్ష , కార్యదర్శులకు రాష్ట్ర , కార్యవర్గ సభ్యులకు ఆత్మీయ సత్కారం , అభినందన
సన్మానం నిర్వహించారు .

Source: (ఉద్యోగులు.న్యూస్)