Apple iPhone: భారీ తగ్గింపు ధరలతో Amazon , Flipkart లలో ఐఫోన్‌లు

 Apple iPhone: భారీ తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్‌లు


Apple iPhone: ఆపిల్ ఐఫోన్ 13 ఇంకా స్టోర్‌లలోకి రాలేదు, అయితే ఐఫోన్ 12 ఇప్పటికే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండింటిలో డిస్కౌంట్ ఆఫర్‌లు లభిస్తున్నాయి. మీరు ఐఫోన్-13 సిరీస్ రాకముందే ఐఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మాత్రం మీకు ఇప్పుడు మంచి అవకాశం.

Apple iPhone 13 సిరీస్ గత వారం ప్రారంభం అవ్వగా.. గత సంవత్సరం iPhone 12 సిరీస్ కంటే హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లను అందులో అందిస్తోంది ఆపిల్ సంస్థ. స్మార్ట్‌ఫోన్‌లు ఇంకా స్టోర్‌లలోకి రాలేదు కానీ, ప్రీ-బుకింగ్‌లు మాత్రం ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్ మరియు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్-13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్ ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే షిప్పింగ్ అక్టోబర్ వరకు ఆలస్యం అవుతుంది. అయితే మీరు ఐఫోన్‌ గత సంవత్సరం మోడల్‌ను పొందడానికి అభ్యంతరం లేకపోతే, అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండూ ఐఫోన్ 12ను వచ్చే వారం ఐఫోన్ 13 విక్రయానికి ముందు డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి తెస్తున్నాయి.

ఐఫోన్ 12 మినీ 64GB మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌లు రూ. 69,900 మరియు రూ. 74,900 ధరతో ప్రారంభించగా.. కస్టమర్‌లు ఇప్పుడు 64GB మరియు 128GB స్టోరేజ్ వేరియంట్‌ల కోసం వరుసగా రూ.56,999 మరియు రూ.63,999 లకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ నుండి వరుసగా ₹ 15,000 మరియు ₹ 14,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు.

Amazon link | Flikart link 

Apple Store

Flash...   Andhra Pradesh: AP నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో మెగా DSC నోటిఫికేషన్