తు.చ.తప్పకుండా అంటే ఏమిటి?

 తు.చ.తప్పకుండా అంటే ఏమిటి? ఇదెలా వచ్చింది అసలు 

Story 1: సంస్కృతం లో తు, చ అనే అక్షరాలని conjunction కోసమూ, ఛందస్సు లో గణాలు
సరిపెట్టడం కోసం ఒక అక్షరం అవసరమైన సందర్భాల్లోనూ వాడతారు. పద్యం కోసం
వాడినప్పుడు ఈ అక్షరాలు పద్యం యొక్క అర్ధానికి కొత్తగా ఎమీ తోడ్పడవు, ఇవి
తీసెయ్యడం వల్ల పద్యం అర్ధం చెడదు. కేవలం fillers లాగ పని చేస్తాయి. ఎవరైనా
ఏదైనా copy చేసే సందర్భాల్లో, అర్ధానికి contribute చెయ్యవని చెప్పి ఈ
అక్షరాలని వదిలెయ్యకుండా వీటిని కూడా copy చేస్తే, దీన్ని తు చ తప్పకుండా
copy చెయ్యడం అంటారు. ఉన్నదున్నట్టు చెప్పడాన్ని తు.చ తప్పకుండా చెప్పడం అన్న
వాడుక ఈ విధం గా వచ్చింది.

“తు.చ తప్పకుండా” ఎలా వచ్చింది ?

Story 2: తు. చ. లు సంస్కృత పదాలట.

సంస్కృత శ్లోకాలు రాసేటప్పుడు , కొన్ని నియమాలు ఉండేవట.

అందులో ఒకటి , “పంక్తి కి 8 అక్షరాలు ఉండాలి.”

ఒక్కోసారి 8అక్షరాలు రాయటం కుదరనప్పుడు, కొన్ని అక్షరాలను ఉంచవచ్చు.(padding)

అవి :

తు, చ, స్వ, హి, వై, ….

ఉదా : రామాయ లక్ష్మనశ్చతు

మరి ఇవి తెలుగులోకి ఎలా వచ్చాయి ?

పూర్వ కాలంలో , సంస్కృత కావ్యాలను తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు , కొంత మంది కవులు, దేవభాష మీది గౌరవంతో , ఈ తు, చ, స్వ, హి, వై లకు కూడా ఎవొ అర్ధాలు (కాని,మరియు…) కల్పించి అనువాదం చేసేవారట .

ఇలాంటి అనువాదాన్ని , తు.చ. తప్పకుండా అనువాదం చెయ్యటం అనేవారట.

అలా వచ్చింది ఈ “తు.చ. తప్పకుండా

Flash...   వర్షం వచ్చే ముందు మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకని?