పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?

 పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?


ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000
అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి.

అయితే, పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత(+)
మేఘాలు పైకి వెళ్తాయి.

అధిక బరువుండే రుణావేశిత (ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న) మేఘాలు కిందికి
వస్తాయి. అంటే, ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్లు
ఎక్కువగా ఉంటాయన్నమాట.

సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత
మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి.

అయితే, ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు
ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి.

ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌
క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే ‘పిడుగు పడటం’ అంటారని
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న నిపుణులు హరి కిరణ్
వివరించారు.

మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు, మెరుపులు పుడతాయని
ఆయన తెలిపారు.

పిడుగులు  భూమి మీదే ఎక్కువ

అలా మేఘాల నుంచి పడే ‘పిడుగు’లో దాదాపు 30 కోట్ల వోల్టుల 
విద్యుత్ఉంటుంది, అది మనిషిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేయగలదు.

ప్రధానంగా ఎండా కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి.
దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని నాసా పరిశోధనలో
తేలింది.

అందులోనూ సముద్రంలో కంటే భూమిపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు
ఉంటాయి.

పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది.

అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం
తీసుకుంటోంది. ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సర్ల ఏర్పాటు
చేశారు.

ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ
అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి
అప్రమత్తం చేస్తున్నారు.

Flash...   What is PAN India stands for - Explianed

దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని
గుర్తించొచ్చని హరి కిరణ్ బీబీసీకి చెప్పారు.

పిడుగుల నుంచి తప్పించుకోవడం ఎలా?

  • ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే.
    కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం.
  • పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.
  • భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.
  • చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు.
  • సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను
    వినియోగించకూడదు.
  • ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు
    ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని
    కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద
    తక్కువగా పడే అవకాశం ఉంటుంది.
  • భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.
  • ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి.
  • ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు
    విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం
    ఉంటుంది.
  • ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి

What causes thunder?

Richard Brill, a professor at Honolulu Community College, explains:
Thunder is caused by lightning, which is essentially a stream of
electrons flowing between or within clouds, or between a cloud and the
ground. The air surrounding the electron stream is heated to as hot as
50,000 degrees Farhenheit, which is three times hotter than the surface
of the sun. As the superheated air cools it produces a resonating tube
of partial vacuum surrounding the lightning’s path. The nearby air
rapidly expands and contracts. This causes the column to vibrate like a
tubular drum head and produces a tremendous crack. As the vibrations
gradually die out, the sound echoes and reverberates, generating the
rumbling we call thunder. We can hear the thundering booms 10 miles or
more distant from the lightning that caused it
Flash...   వాతావరణ పీడనం అంటే ఏమిటి? ఏ యూనిట్లలో కొలుస్తారు?
When the lightning is within sight, however, we see it first because the
speed of sound in air is considerably slower that that of the electron
flow. Thus, the sound behaves more like a shock wave than an ordinary
sound wave. The shock wave follows the path of the electrons like a fist
in a sock. The speed of sound is even more insignificant when compared
to the speed of light. The light from the flash reaches us in a fraction
of a second, whereas the sound lags along like a snail following an
interplanetary rocket.
The audiovisual spectacle of thunder and lightning is a combination of
the dynamics of the vibration of air molecules and their disturbance by
electrical forces. It is an awesome show–and one that reminds all of us
of the powers of nature and our own insignificance in relation to them.