Gratuity, Leave Encashment లెక్కింపు పై కేంద్రం తాజా ఉత్తర్వులు

 గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్మెంట్ లెక్కింపుపై కేంద్రం  తాజా ఉత్తర్వులు

Dearness Allowance amount to calculate Gratuity, Leave Encashment of Central Government pensioners changed!

• కరోనా సమయంలో ఆపేసిన DAలతో కలిపి లెక్కిస్తూ చెల్లింపు

• AP లోనూ అలాగే చెల్లించాలని  డిమాండ్ 

సెప్టెంబరు 11:  ఉద్యోగ విరమణ పొందిన  ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే ఉత్తర్వులు జారీ చేసిందని AP జేఏసి ప్రధానకార్యదర్శి  జి.హృదయ రాజు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పలు ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం అందరికి తెలిసిందే. ఆంక్షల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు DAను స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. JANUARY 1, 2020 నుంచి JUNE 30, 2021 వరకు కేంద్ర ప్రభుత్వం DA వాయిదాలు విడుదల చేయలేదు.

 JANUARY 1, 2020 నుంచి నాలుగు %, JULY1 2020 నుంచి మూడు %, JANUARY1 2021 నుంచి నాలుగు % చొప్పున పెంచవల్సిన అదనపు కరువు భత్యం వాయిదాలను షెడ్యూలు ప్రకారం ఇవ్వకుండా ఏడాదిన్నర పాటు నిలిపివేసి, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో JANUARY1, 2020 నుంచి JUNE 30, 2021 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్మెంట్ చెల్లింపులో పెరిగిన DA వర్తించలేదు. ఈ విషయంపై పునరాలోచన చేయాలని చేసిన డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించింది. JANUARY1, 2020 – JUNE 30, 2021 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి  ఇటీవల విడుదల చేసిన DAలను కలిపి గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్మెంట్ మొత్తాలను లెక్కగట్టి చెల్లించాలని పేర్కొంటూ తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. 

  కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి అదే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని AP జేఏసీ రాష్ట్ర చైర్మన్, సెక్రెటరీ జనరల్ లు బండి శ్రీనివాస రావు, జి.హృదయ రాజు లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం JANUARY 2020 – JUNE 2021 మధ్య కాలంలో పెంచాల్సిన మూడు DA వాయిదాలను ఇంకా మంజూరు చేయలేదు. JANUARY 1, 2020 నుంచి 3.64 %, JULY 1, 2020 నుంచి 2.73 %, JANUARY 1, 2021 నుంచి 3.64 % అదనపు DA మొత్తాలను రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సి ఉంది. పెరగనున్న ఈ DA వాయిదాలను కూడా కలిపి గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్మెంట్ లెక్కిస్తే రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుతుందని AP జేఏసీ పేర్కొంది.

Flash...   Best Investments: ఆడపిల్లల బంగారు భవిష్యత్‌కు ఆ పథకాలే ముఖ్యం. నమ్మలేని వడ్డీ రేట్లు

New percentage of DA for calculation of Gratuity, leave encashment

  1. For employees retiring from 1st January 2020 to 20th June 2020: Now 21% of basic pay is the notional percentage of DA to be used for calculation of Gratuity and Leave Encashment
  2. For employees retiring from 1st July 2020 to 31st December 2020: Now 24% of basic pay is the notional percentage of DA to be used for calculation of Gratuity and Leave Encashment
  3. For employees retiring between 1st January 2021 to 30th June, 2021: Now 28% of basic pay is the notional percentage of DA to be used for calculation of Gratuity and Leave Encashment.