Weight Loss: మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..! ఈ 3 విషయాలు తెలుసుకోండి..

 Weight Loss: మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా..!  ఈ 3 విషయాలు తెలుసుకోండి..


Weight Loss: దేశంలో COVID కేసుల సంఖ్య తగ్గుతుండటంతో ఇప్పుడిప్పుడే అన్నీ సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. గత ఒకటిన్నర సంవత్సరాలుగా అందరు కొవిడ్‌తో నానా తంటాలు పడ్డారు. దీంతో అందరిలో చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అధిక బరువు సమస్య. ఎందుకంటే అందరు వర్క్‌ ఫ్రం హోం చేయడంతో చాలా మంది విపరీతమైన బరువు పెరిగారు. ఇప్పుడిది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అయితే బరువు తగ్గించడానికి ప్రయత్నిస్తుంటే కచ్చితంగా ఈ మూడు విషయాలు తెలుసుకోండి.

1. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు హైడ్రేషన్‌లో ఉంచుకోవడం ముఖ్యం. తరుచుగా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం 2.5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీరు చేసే శారీరక పని స్థాయిని బట్టి నిర్ణయం తీసుకోండి.

2. మీ రోజువారీ డైట్‌లో పండ్లను చేర్చండి

బరువు తగ్గడానికి ప్రయత్నించినప్పుడు ఆహారంలో చక్కెరను తగ్గించడం మంచిది. అయితే పండ్లలో సహజ చక్కెర ఉంటుంది ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. పండ్లు తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. వీలైనంత ఎక్కువగా పండ్లను తినడం అలవాటు చేసుకోండి. కచ్చితంగా డైట్‌లో సీజనల్‌ ఫ్రూట్స్‌ ఉండేలా చూసుకోండి.

3. వ్యాయామం తప్పనిసరి

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ కేలరీలు అలాగే ఉంటాయి. దీంతో ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మీరు ప్రతిరోజూ ఒక గంట పాటు వ్యాయామం చేస్తే చురుకుగా ఉంటారు. మెట్లు ఎక్కడం, కొద్దిసేపు నడవడం వల్ల మీ మెటబాలిజం పెరుగుతుంది. అంతేకాదు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Flash...   కొత్త ATM లు వచ్చేశాయి.. డెబిట్ కార్డు PIN మర్చిపోయినా డబ్బులు తీసుకోవచ్చు