ఉద్యోగుల్లో నశించిన సహనం.. ఆందోళనలో ప్రభుత్వ పెద్దలు

 ఉద్యోగుల్లో నశించిన సహనం.. ఆందోళనలో ప్రభుత్వ పెద్దలు


రెండున్నరేళ్లకు భారీగా రోడ్డెక్కిన ఉద్యోగులు.. 

జగన్‌  సర్కారు వచ్చాక అతిపెద్ద ఉద్యోగ ఉద్యమం 

భవిష్య ఉద్యమాలకు ఊపిరిపోసిన సీపీఎస్‌ ఉద్యోగులు

ఆందోళనలో ప్రభుత్వ పెద్దలు

ప్రమాద ఘంటికలేనని తర్జనభర్జన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ లోకమంతా ఏకమై గొంతెత్తింది. తమ ఫోన్లపైనా, తమపైనా నిఘా ఉందన్న భయానక నీడలో రెండున్నరేళ్లుగా బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల్లో సహనం న శించింది. సీపీఎస్‌ ఉద్యోగులు చేపట్టిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులూ పాల్గొన్నారు. రెండున్నరేళ్ల నుంచి డిమాండ్ల సాధనకు రోడ్డెక్కని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఉద్యమబాటలో పాల్గొనడంతో ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ఉద్యోగుల పోరుబాట కొనసాగితే తమకిక గడ్డుకాలమేనని ప్రభుత్వ పెద్దలు ఆందోళనకు గురవుతున్నారు.

వేతన సవరణకు ఎదురు చూపులు.. 

పెరిగిన ధరలు, కరోనా ఇక్కట్లతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు ఉద్యోగులు కరోనాతో మరణించగా, వారి కుటుంబాలు ఆర్థిక కష్టాల బారినపడ్డాయి. అయినా ప్రభుత్వం కరుణించలేదు. 11వ వేతన సవరణ కమిషన్‌ను నియమించి ఇప్పటికే మూడేళ్లు దాటింది. ఆ కమిషన్‌  ఏమిచ్చిందో? ఎప్పటికి అమలు చేస్తారో? ఇప్పటికీ ఉద్యోగులకు స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చీ ఇచ్చీ పెన్నుల్లో ఇంకు ఖర్చే తప్ప ఫలితంలేదని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. 

అతీగతీ లేని డీఏ ఎరియర్స్‌

2018 జూలై, 2019 జనవరి డీఏలను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించింది. అయితే చెల్లించాల్సిన డీఏ ఎరియర్స్‌పై ఇప్పటికీ అతీగతీలేదు. కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా మూడు డీఏలను ఫ్రీజ్‌ చేసింది. ఆ తర్వాత వాటిని విడుదల చేసి, కేంద్ర ఉద్యోగులకు చెల్లింపులు చేసింది. అయితే అదే అదనుగా మూడు డీఏలను ఫ్రీజ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వాటి చెల్లింపుల ఊసే ఎత్తడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. 

అవసరాలకు అందని సొమ్ము..

గత ఐదారు నెలలుగా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు రావడంలేదని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. మందుల కొనుగోలుకు, ఇతర అవసరాలకు ఇతరుల వద్ద చేయి చాచాల్సిన దౌర్భాగ్యస్థితి ఏర్పడిందంటున్నారు. ఇక ఆరోగ్య సమస్యలు,  పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం జీపీఎ్‌ఫలోన్‌ , ఏపీజీఎల్‌ఐ లోన్‌ కోసం ఉద్యోగులు దరఖాస్తు చేస్తే నెలల తరబడి చూడాల్సిన దుస్థితి దాపురించింది. ఒక్కోసారి ఆరు నెలలకూ చెల్లింపులు జరగడంలేదని. తాము దాచుకున్న సొమ్మును తమకు ఇవ్వడానికి ప్రభుత్వానికేం కష్టం అని వారు వాపోతున్నారు. 

Flash...   GST పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. ఆలస్యమైతే రూ.500 చెల్లిస్తే చాలు!

స్ఫూర్తి నింపిన సీపీఎస్‌ ఉద్యోగుల పోరు..

ఇన్ని విధాలుగా ప్రభుత్వం వేధిస్తున్నా, కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోయినా రెండున్నరేళ్లుగా ఉద్యోగులు మౌనంగానే భరిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో  బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సీపీఎస్‌ ఉద్యోగులు చేపట్టిన పెన్షన్‌ విద్రోహ దినంలో ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా భాగస్వాములయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా, చట్టబద్ధంగా వారికి రావాల్సినవి ఇవ్వకుండా భయపెట్టే రీతిలో వ్యవహరిస్తుండడంతో వారిలో తీవ్ర అసహనం గూడుకట్టుకుంది. ఇలాంటి తరుణంలో సీపీఎస్‌ ఉద్యోగులు తమ సమస్య పరిష్కరించాలంటూ రోడ్డెక్కి నిరసన గళం విప్పారు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.  ఫలితంగానే సీపీఎస్‌ ఉద్యోగుల నిరసనకు ఇతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. జగన్‌  సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత  సమస్యల పరిష్కారం కోసం ఇంత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడం ఇదే తొలిసారి అని ఉద్యోగులు చెబుతున్నారు.

భయాందోళనల్లో ఉద్యోగులు..

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వోద్యోగుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి న్యాయంగా, చట్టబద్ధంగా తమకు రావాల్సిన ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న కష్టాల గురించి చర్చించినా ఏమౌతుందోనన్న భయం. తమపై ఏ తప్పుడు కేసు పెడతారోనన్న ఆందోళన ఉద్యోగుల్లో గూడు కట్టుకుంది. ప్రభుత్వ సమాచారం లీక్‌ చేస్తున్నారంటూ ఇటీవల   సచివాలయం ఫైనాన్‌ ్స విభాగంలోని ముగ్గురు ఉద్యోగులను  సస్పెండ్‌ చేశారు. ఉద్యోగ విధులు నిర్వర్తించడానికి సరైన సదుపాయాలు కల్పించాలని అడిగిన ఉద్యోగులను.. ఫేస్‌బుక్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు, వాట్సా్‌పలో మెసేజ్‌లు పంపారంటూ సస్పెండ్‌ చేసిన ఘటనలూ అనేకం ఉన్నాయి.