పునీత్ రాజ్ కుమార్ చనిపోయింది జిమ్ వల్ల కాదు.. అసలు విషయం బయటపెట్టిన హీరో శ్రీకాంత్

 పునీత్ రాజ్ కుమార్ చనిపోయింది జిమ్ వల్ల కాదు.. అసలు విషయం
బయటపెట్టిన హీరో శ్రీకాంత్

SRIKANTH-PUNEETH

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో యావత్ సినిమా ఇండస్ట్రీ
శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగులో స్ట్రైట్ సినిమా చేయలేకపోయినప్పటికీ..
అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరితోనూ పునీత్ రాజ్ కుమార్‌తో మంచి
అనుబంధం ఉంది. ఇటీవల ఆయన నటించిన ‘యువరత్న’ సినిమాను తెలుగులో కూడా రిలీజ్
చేశారు. ఇక ఎన్టీఆర్ ఆయన సినిమాలో పాటపాడటం.. పూరీ జగన్నాథ్, మెహర్ రమేష్
వంటి దర్శకులతో పనిచేయడంతో పాటు.. చాలామంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు
పునీత్ రాజ్ కుమార్.

ఈ సందర్భంలో ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించడానికి మెగాస్టార్
చిరంజీవి, వెంకటేష్‌లతో కలిసి వెళ్లిన హీరో శ్రీకాంత్.. పునీత్ రాజ్
కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంలో
పునీత్ జిమ్ చేస్తూ చనిపోయాడంటూ వస్తున్న వార్తలపై స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఆయన లేదంటే నమ్మలేకపోతున్నా.. కళ్లముందే
కనిపిస్తున్నారు.. ఎందుకంటే ఆయనతో ‘జేమ్స్’ అనే సినిమాను రీసెంట్‌గా చేశాను.
సుమారు 40 రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్.
ఆయన నాకు ముందే తెలుసు.. పునీత్ వాళ్ల ఫ్యామిలీ కూడా నాకు బాగా తెలుసు.

పునీత్ నేను కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం.. జేమ్స్ సినిమా రిలీజ్ కాలేదు..
రీసెంట్‌గానే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చాలామంది మంచి వ్యక్తుల్ని చూశాను
కానీ.. పునీత్ లాంటి వ్యక్తిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఒక స్టార్ హీరో
కొడుకు అనే అహంకారం లేకుండా.. ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉంటూ.. వాళ్లని హగ్
చేసుకుని వాళ్లకి సపోర్ట్ చేస్తారు. పబ్లిసిటీ లేకుండా ఎంతో మందికి హెల్ప్
చేస్తుంటారు. పునీత్ ఫ్రెండ్స్ కూడా నాకు చాలామంది తెలుసు. చిన్ననాటి
స్నేహితుల్ని ఎవర్నీ కూడా వదలకుండా పునీత్ వాళ్లకి కూడా హెల్ప్ చేస్తూ
వస్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తి లేడంటే జీర్ణించుకోలేకపోతున్నా.

Flash...   PM MODI SPEACH HIGHLIGHTS: లాక్ డౌన్ పెట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి

జేమ్స్ సినిమాలో పునీత్ బాడీ బిల్డర్ రోల్ చేస్తున్నారు. నేను ఫ్యామిలీ
విలన్‌ని. అతను నాకు బాడీ గార్డ్‌గా ఉండేరోల్. ఆయన వ్యక్తిత్వం ఎంత మంచిది
అంటే.. షూటింగ్ టైంలో నాకోసం ఇంటి నుంచి భోజనం రప్పించేవారు. శ్రీకాంత్
సార్.. ఇంట్లో నుంచి భోజనం వస్తుంది.. బయట చేయొద్దు.. అర్థగంట ఆలస్యం అయినా
ఇంటి నుంచే రప్పిస్తా అని అడిగి మరీ భోజనం పెట్టేవారు.కేవలం నాతోనే కాదు..
అందరితోనూ అలాగే ఉండేవారు.

ఎప్పుడూ సెట్‌లో మంచి హుషారుగా ఉంటారు.. చాలా ఫిట్‌గా ఉంటారు. అసలు పునీత్
ఎప్పుడూ కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.. ఫీవర్‌ రావడం కూడా తెలియదని
పునీత్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. నిజానికి చాలామంది జిమ్ చేస్తూ చనిపోయాడని
అంటున్నారు.. టీవీలలో కూడా వచ్చింది.. అది నిజం కాదు.. రాత్రి నుంచే ఆయన
అస్వస్థత గురయ్యారు. ఉదయాన్నే లేచి కూర్చున్న తరువాత అన్ ఈజీగా ఉందని డాక్టర్
దగ్గరకు వెళ్లారు. జిమ్ చేయడం వల్లే ఆయన చనిపోయాడనేది నిజం కాదు.. జిమ్
చేస్తూ పడిపోలేదు.. అసలు ఆయన జిమ్‌కి వెళ్లలేదు. ముందు ఫ్యామిలీ డాక్టర్
దగ్గరకు వెళ్లారు.. ఆ తరువాత విక్రమ్ హాస్పటల్‌కి షిఫ్ట్ చేశారు.

గుండెపోటుతో చనిపోవడం అనేది వాళ్ల ఫ్యామిలీ ఉంది.. పునీత్ తండ్రి రాజ్
కుమార్ గారు గుండెపోటుతో మరణించారు శివరాజ్ కుమార్‌ గారికి కూడా గుండెపోటు
వచ్చింది.. అలాగే ఆయన తమ్ముడికి కూడా గుండెపోటు వచ్చింది. అలాగే పునీత్‌కి
కూడా సడెన్ స్ట్రోక్ రావడం వల్లే మరణించారు’ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు
హీరో శ్రీకాంత్.