ఈ నెలాఖరులోగా PRC పై నిర్ణయం ..PRC పై 18, 19 తేదీల్లో సమావేశం

ఈ నెలాఖరులోగా పీఆర్సీపై నిర్ణయం

ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి

అక్టోబరు 13-  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పీఆర్సీపై అక్టోబరు నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మిగిలిన సమస్యలు నెలాఖరులోగా పరిష్కరిస్తామని అన్నారు. ఉద్యోగుల జేఏసీ నాయకులు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళారు. ధనుంజయ్ రెడ్డి, సజ్జల వారితో చర్చలు జరిపారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెలాఖరులోగా పీఆర్సీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. 

అమరావతి: ఏపీలో పీఆర్సీ సమస్య ఈ నెలాఖరకు కొలిక్కి వస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అడగక ముందే జగన్‌ ప్రభుత్వం ఐఆర్‌ ఇచ్చిందని చెప్పారు. జగన్‌ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపైనే ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వేతన సవరణ, కరవు భత్యాల బకాయిల కోసం గళమెత్తిన ఉద్యోగ సంఘాలతో తాడేపల్లిలో ప్రభుత్వం చర్చలు జరుపింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చర్చల్లో పాల్గొన్నారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘ఉద్యోగుల సంక్షేమంలో మా ప్రభుత్వం 2 అడుగుల ముందే ఉంది. కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఆ కారణంగానే చిన్న చిన్న సమస్యలు. ఐఆర్‌ అమలులో కాస్త ఆలస్యం జరిగింది. వచ్చే నెలాఖరులోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయి. జీతాలు ఇటీవల ఆలస్యమవుతున్న మాట వాస్తవమే. ఉద్యోగ సంఘాలతో చర్చలు కొనసాగుతాయి. ఉద్యోగులను తన జట్టులో భాగంగా సీఎం భావిస్తారు’’ అని సజ్జల అన్నారు.

పీఆర్సీపై 18, 19 తేదీల్లో సమావేశం

– సీఎస్ నిర్వహిస్తారు

– బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడి

(ఉద్యోగులు న్యూస్)

అక్టోబరు 13-   ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పీఆర్సీ అమలుకు సంబంధించి నిర్ణయ తీసుకునేందుకు అక్టోబరు 18, 19 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం ఏర్పాటు చేయనున్నారని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో తాము మాట్లాడగా వారు ఈ విషయం వెల్లడించారన్నారు. నెలాఖరులోగా పీఆర్సీ సమస్య పరిష్కారానికి నిర్ణయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

Flash...   PRC ఇంతే ఇస్తాం.. ఇదే ఫిక్స్.. ఇక మీ ఇష్టం..!

– వైద్య కార్డులపైనా చర్చ జరిగింది. అవి వైద్యానికి పనికి రావడ లేదని చెప్పాం. నెట్ వర్కు ఆస్పత్రలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలి లేదా బీమా అమలు చేయాలని కోరాం.

– కారుణ్య నియామకాలు 45 రోజుల్లోగా పూర్తి చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు హామీ ఇచ్చారు.