గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత

  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోత

బయోమెట్రిక్‌ హాజరు లేదని 10-50% వరకు తగ్గింపు

అమరావతి: రెండేళ్ల సర్వీసు పూర్తవడంతో ప్రొబేషన్‌ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది.
బయోమెట్రిక్‌ హాజరు లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10%, మరికొందరికి 50% వరకు
తగ్గించారు. ఈ మేరకు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన
డాటా జిల్లాలకు చేరింది. వీటి ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాలని
డ్రాయింగ్‌, డిజ్బర్స్‌మెంట్‌ అధికారుల(డీడీవో)ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ
(ఆర్‌సీ నంబరు: 1/ఏ/2021) ఆదేశించింది. అయితే… క్షేత్రస్థాయిలో సాంకేతిక
సమస్యలను పరిష్కరించకుండా హాజరు లేదని జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగుల్లో
ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు శనివారం మండల
అధికారులకు వినతులు ఇచ్చారు. సాంకేతిక సమస్యలను సరిచేసి మరోసారి హాజరు, జీతాల
డాటాను రూపొందించాలని కోరారు.

* సిగ్నల్‌ సమస్యతో కొన్ని చోట్ల బయోమెట్రిక్‌ ఆన్‌లైన్‌ విధానం సరిగా పనిచేయక
పోవడం, కొన్నిచోట్ల డివైజ్‌లు అందుబాటులో లేక దస్త్రాల్లోనే సంతకాలు
చేయాల్సిరావడం తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి

పూర్వ పద్ధతిలోనే జీతాలివ్వాలి

– వెంకట్రామిరెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు

బయోమెట్రిక్‌ హాజరు యాప్‌తో సంబంధం లేకుండా పూర్వ పద్ధతిలోనే ఉద్యోగులకు
జీతాలు చెల్లించాలి. ప్రొబేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి రెగ్యులర్‌ స్కేల్‌
ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం.

గ్రామ, వార్డు సచివాలయ  ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

పాలనలో సంస్కరణలు తీసుకొస్తున్న వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం నేటి నుంచి
అమలులోకి రానుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామ వాలంటీర్లకు
బయోమెట్రిక్ హజరు తప్పనిసరి చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం
అమల్లోకి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు నేటి
(సోమవారం) నుంచి బయోమెట్రిక్‌ హాజరు వేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఈ
మేరకు ఇదివరకే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై ఏపీ సచివాలయ ఉద్యోగులు సమయానికి
తమ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రజలకు వారు అందుబాటులో ఉండేలా చూసేందుకు
ఏపీ సర్కార్ ఈ చర్యలు చేపట్టింది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్ర
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు ప్రతిరోజూ బయోమెట్రిక్‌
హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు.

Flash...   LOCK DOWN IN AP: Govt going to implement strict rules to prevent Covid from 05.05.21

ఈ బయో మెట్రిక్ హాజరు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గ్రామ సచివాలయ
పంచాయతీ కార్యదర్శి లాగిన్‌ నుంచి బయోమెట్రిక్‌ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌
చేసుకోవాలో తమ ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు
విధులకు హాజరైనట్లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకుని, విధులు ముగించుకుని
ఇంటికి వెళ్లే సమయంలో  సాయంత్రం 5.30 గంటలకు రెండోసారి బయోమెట్రిక్ నమోదు
చేసుకోవాలి. లేని పక్షంలో జీతంలో కోత విధించడంతో పాటు ఉద్యోగులకు కౌన్సెలింగ్
ఇచ్చే ఇవ్వనున్నారని తెలుస్తోంది.