పీఆర్సీ నివేదిక 4,5 రోజుల్లో విడుదల?

 పీఆర్సీ నివేదిక  4,5 రోజుల్లో విడుదల?

–  గుర్తింపు సంఘాలకు అందజేత

– అధ్యయనానికి కొంత గడువు

– ఆ తర్వాతే చర్చల ప్రక్రియ…

(ఉద్యోగులు న్యూస్) 

అక్టోబరు 14- ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యమైనా కానీ పీఆర్సీ అమలు చేసే జాతర ప్రక్రియ ప్రారంభమవుతోంది. దసరా సెలవులు పూర్తయిన వెంటనే సోమ, మంగళవారాల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో గుర్తింపు సంఘాలన్నీ పాల్గొంటాయి.  ఆ సమావేశంలోనే  తొలుత 11వ  వేతన సవరణ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రతిని విడుదల చేసే అవకాశం ఉంది. పూర్తి నివేదికతో పాటు  నివేదికలోని ముఖ్యాంశాలన్నింటినీ సంక్షిప్త నివేదికగా పొందుపరిచి ఉద్యోగ సంఘాలు అందరికీ అందించనున్నారు. అందులోనే ఫిట్మెంట్  ఎంత సిఫార్సు చేసింది అన్నది స్పష్టమవుతుంది. ప్రభుత్వంతో నిర్వహించే చర్చల ప్రక్రియకు అదే ఆధారమవుతుంది.  వేతన సవరణ కమిషన్ 27శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసిందన్న విషయాన్ని ఇప్పటికే ఉద్యోగులు.న్యూస్  ఎప్పుడో వెల్లడించింది. దాదాపు అదే మొత్తం సిఫార్సు చేసినట్లు ఇప్పటికీ విశ్వసనీయమైన సమాచారం ఉంది.

పదకొండో వేతన సవరణ కమిషన్ ను కలిసి అప్పట్లోనే ఉద్యోగ సంఘాలు వివిధ డిమాండ్లను వారి ముందుంచాయి. కొత్త వేతన సవరణ నివేదికలో సర్వీసు అంశాలకు సంబంధించిన అనేక డిమాండ్లు వారి ముందుంచాయి. అందులో కమిషన్ ఏయే అంశాలు పరిశీలించి వేటిని సిఫార్సు చేసింది అన్నది కీలకాంశం. ఉద్యోగ సంఘాలన్నీ  నివేదికను అధ్యయనం చేసిన తర్వాత మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ నివేదికపై ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేసే అభిప్రాయాల ఆధారంగా తదుపరి పరిణామాలు ఉంటాయి

Flash...   Faculty Jobs in ANU: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU)లో 175 పోస్టులు!