AIDED స్కూళ్లకు నిధులు ఆపొద్దు -విలీనం కోసం ఒత్తిడి చేయొద్దు

 ఎయిడెడ్ స్కూళ్లకు నిధులు ఆపొద్దు -విలీనం కోసం ఒత్తిడి చేయొద్దు -సీజే బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు.

➽ ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జీవోలు

➽  హైకోర్టును ఆశ్రయించిన విద్యాసంస్థలు

➽  స్టే ఇచ్చిన హైకోర్టు

➽  విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకురావొద్దని ఉత్తర్వులు

➽  తదుపరి విచారణ ఈ నెల 28 కి వాయిదా

AP high court on Aided schools Issue | ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు మరో షాకిచ్చింది. ఎయిడ్ స్కూళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే జీవోను ఇదివరకే తప్పుపట్టిన కోర్టు.. వివాదం ముగిసే దాకా విద్యా సంస్థలకు ఎయిడ్ కొనసాగించాల్సిందేనని తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది..


ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ విద్యా సంస్థలపై కొనసాగుతోన్న వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నిటినీ ప్రభుత్వంలోకి విలీనం చేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ పలు కాలేజీల అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో భాగంగా హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలిచ్చింది. సీజే అనూప్ గోస్వామి ధర్మాసనం ఈ కేసును విచారించింది..

విలీనం ప్రక్రియకు సంబంధించి ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి చేయరాదని, విల్లింగ్(విలీనానికి ఒప్పుకుంటూ) లేఖలు ఇవ్వనందుకు ప్రభుత్వ సాయం(ఎయిడ్) ఆపడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 22లోపు సంబంధిత పిటిషన్లు అన్నిటికీ కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించిన కోర్టు.. ఈనెల 28 వరకు ఎయిడెడ్ సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగరాదని కట్టడి చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిడ్ ఆపొద్దన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.

నిజానికి ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలోకి విలీనం చేస్తున్నట్లు జారీ అయిన ఉత్తర్వులను సైతం హైకోర్టు గతంలోనే తప్పు పట్టింది. స్కూళ్లు, కాలేజీలు నడపడానికి సరైన నిధులు లేని విద్యా సంస్థలు తమకు తాముగా అంగీకరిస్తే తప్ప విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలేగానీ, సొంతగా నడుపుకొంటామనే వారిని కూడా బలవంతంగా విలీనానికి ఒప్పించడం సబబు కాదని సెప్టెంబర్ 24నాటి విచారణలో జడ్జిలు వ్యాఖ్యానించారు. అయితే, తీర్పుపై ఆశాభావంతో ఉన్న జగన్ ప్రభుత్వం.. ఎయిడెడ్ విలీన ప్రక్రియను మరింత ముందుకు నెడుతూ కాలేజీలపై ఒత్తిడి పెంచుతోందని పిటిషన్లు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎయిడెడ్ స్కూళ్ల విలీనం వివాదంపై సోమవారంనాటి విచారణలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎయిడ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదన్న సీజే ధర్మాసనం.. ఆ మేరకు(ఎయిడ్ విడుదలకు సంబంధించి) ఉత్తర్వులు జారీ అయ్యేలా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆర్జేడీ, డీఈవోలకు సూచనలు పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Flash...   Proposal for sanction of Notional Increments to the Special Teachers appointed on fixed pay of Rs.398/-

ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటోన్న జగన్ సర్కారుకు ఈ పరిణామం ఎదురుదెబ్బలా నిలిచింది. కేసులు విచారణ జరుగుతున్న వేళ విద్యా సంస్థల యాజమాన్యాలను ప్రభుత్వం బెదిరిస్తున్నదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజయ్, సుబ్బారావు, నర్రా శ్రీనివాస్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.