Eye Treatment With IPhone: ‘i Phone 13తో ‘ఐ’ ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్..

 Eye Treatment With IPhone : ‘ఐ’ ఫోన్‌13తో ‘ఐ’ ట్రీట్మెంట్‌ చేస్తున్న డాక్టర్..

ఐఫోన్ తో ఐ ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్.. కంటి స్పెషలిస్టు డాక్టర్ టామీ కార్న్ యాపిల్‌ ఐఫోన్‌13తో కళ్లకు ట్రీట్ మెంట్ చేస్తు పలువురిని ఆకట్టుకుంటున్నారు.

Doctor uses iPhone 13 Pro Max camera for eye treatment : టెక్నాలజీ మార్పులతో వైద్య చరిత్రలో ఎన్నో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. కానీ ఓ డాక్టర్ మాత్రం వైద్య చరిత్రలో ఓ అద్భుతాన్ని సృష్టించాడు.మన శరీరభాగాల్లో అని సున్నితమైన కంటికి యాపిల్‌ ఐఫోన్‌13తో వైద్యం చేస్తున్నాడు. కంటి చూపును మెరుగు పరిచటానికి ఐఫోన్ తో అద్భుతాలు చేస్తున్నారు ‘టామీ కార్న్’ అనే డాక్టర్. ఫోన్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ టెక్నాలజీని ఉపయోగించి కంటిచూపు సమస్యల్ని ఐఫోన్ తో పరిష్కరిస‍్తున్నారు. ఇది వినటానికి వింతగానే ఉన్నా డాక్టర్ టామీ కార్న్ వద్ద ఈ ఐఫోన్ చికిత్స తీసుకున్న పేషెంట్లు కూడా తమ చూపు మెరుగైందని చెబుతున్నారు. డాక్టర్ టామీ కార్న్ చేస్తున్న ఈ ఐఫోన్ ఐ ట్రీట్మెంట్ గురించి పలువురు నిపుణులు సైతం ఇదొక మెడికల్‌ మిరాకిల్‌ అంటున్నారు.

డాక్టర్ టామీ కార్న్ ఆప్తమాలజిస్ట్. అమెరికా కాలిఫోర‍్నియాలోని శాన్‌డియాగో అనే ప్రాంతానికి చెందినవారు. ఆయన కార్న్ టెక్సాస్‌ సౌత్‌ వెస్ట్రన్‌ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ తరువాత గత 21 ఏళ్లుగా కంటి వైద్యుడిగా ఎంతోమంది పేషెంట్లు కంటిచూపు మెరుగుపరిచారు. ఆయన చేతులతో ఎన్నో కంటి ఆపరేషన్లు చేశారు. డాక్టర్ టామీ కార్న్ ప్రస్తుతం షార్ప్‌ మెమోరియల్‌ ఆస్పత్రిలో ప్రముఖ ఆప్తమాలజిస్ట్‌గా,డిజిటల్‌ ఇన్నోవేటర్‌(టెక్నాలజీతో చేసే వైద్యం)గా పనిచేస్తున్నారు.ఈక్రమంలో డాక్టర్ టామీ కార్న్ ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ని ఉపయోగించి ‘ఐ’ ట్రీట్మెంట్‌ చేస్తు పలువురు పేషెంట్లకు కంటిచూపుని అందించటంలతో పాటు పలువురు నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నారు.

అంతేకాదు ఈ టెక్నాలజీ ద్వారా కంటి చూపు ఏ స్థాయిలో ఉందో గుర్తించి ఫోటోల్ని క్యాప‍్చర్‌ చేస్తున్నారు. ఆ ఫోటోల సాయంతో కార్నియా ఆపరేషన్‌ తరువాత వచ్చే కార్నియా రాపిడి సమస్యలకు పరిష్కరిస్తున్నారు. సాధారణ ట్రీట్మెంట్‌తో చేయలేని పలు సున్నితమైన సమస్యల్ని మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ తో కంటికి ట్రీట్మెంట్‌ ఎలా చేస్తున్నారో లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు.

Flash...   బదిలీలతో ఆ పాఠశాలల మూత

మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ అంటే ఏమిటి?..

ఒకప్పుడు ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ ఉండాల్సి వచ్చేది.ఫోటోగ్రఫీ గురించి ఓ ప్రత్యేక ఎడ్యుకేషనే ఉండేది. ఇప్పటికి ఉంది కూడా. కానీ ఇప్పుడలా కాదు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటేచాలు ఎవ్వరైనా ఫోటోలు తీయొచ్చు. అటువంటిది చేతిలో ఐ ఫోన్ ఉంటే.ఆ ఫోన్ తో తీసే ఫోటోల క్లారిటీయే వేరు. అలాబసినిమాటిక్‌ మోడ్‌, మ్యాక్రోమోడ్‌ ఫీచర్ల సాయంతో సాధారణ లొకేషన్లలో అందంగా ఫోటోల్ని క్యాప్చర్‌ చేయోచ్చు.ఇప్పుడు ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌లో ఉన్న మ్యాక్రోమోడ్‌ ఫీచర్‌ను ఉపయోగించే డాక్టర్‌ టామీ కార్నియాకు సంబంధించి కంటి వైద్యం చేస్తున్నారు. ఫోన్లో ఎన్ని ఫోటో ఫీచర్స్‌ ఉన్నా..మ్యాక్రోమోడ్‌ అనేది వెరీ స్పెషల్. దీంట్లో భాగంగా ఫన్ ఎగ్జాంపుల్..కంట్లో ఉన్న అతి సూక్ష్మమైన నలుసుని కూడా ఈ అడ్వాన్స్‌డ్‌ మ్యాక్రోమోడ్‌ టెక్నాలజీతో హెచ్‌డీ క్వాలిటీ ఫోటోల్ని తీయొచ్చు. అదే చేస్తున్నారు డాక్టర్ టామీ కార్న్.

ఐఫోన్‌13 ప్రో మ్యాక్స్‌తో డాక్టర్ ట్రీట్మెంట్‌..

కంటిలో ముందు భాగాన్ని కార్నియా అంటారనే విషయం తెలిసిందే. ఈ కార్నియా చాలా పలచగా అత్యంత సున్నితంగా ఉంటుంది. వెలుతురిని కంటి లోపలి భాగాలకు చేరవేయటంలో కార్నియాది కీలకపాత్ర. కార్నియా ఆపరేషన్ చాలా సున్నితమైనది. ఈక్రమంలో కార్నియా ఆపరేషన్‌ చేయించుకున్నన్న ఓ వ్యక్తి సమస్యకు పరిష్కారం చూపారు డాక్టర్ టామీ. సాధారణంగా కార్నియా ఆ ఆపరేషన్‌ తరువాత తాత్కాలికంగా కంటి లోపల రాపిడి జరుగుతుంది. ఆ సమస్యను అధిగ మించేలా ఐఫోన్‌ 13లో ఉన్న మ్యాక్రో మోడ్‌తో కంట్లో కార్నియాను చెక్‌ చేశారు.ఆ తరువాత ఆ సమస్య గురించి డాక్టర్‌ టామీకార్న్‌ సదరు పేషెంట్‌ను అడిగారు. ఇప్పుడెలా ఉంది? అని..దానికి సదరు వ్యక్తి ఇప్పుడు నా కంటిచూపు మెరుగుపడింది..అని సంతోషం వ్యక్తంచేశాడు. ఆ పేషెంట్‌కు అందించిన ట్రీట్మెంట్‌ విధానాన్ని డాక్టర్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయటంతో దానికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. భలే ఉందే ‘ఐ’ఫోన్ తో ఐ ట్రీట్ మెంట్ అంటున్నారు.

Flash...   SBI భారీ జాబ్‌ నోటిఫికేషన్‌.. 642 ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు