సర్కారుకు ఎయిడెడ్ సెగ..’అమ్మఒడి మాకొద్దు’ అంటూ నినాదాలు..

సర్కారుకు ఎయిడెడ్ సెగ

తల్లిదండ్రులు సెయింట్ ఆన్స్ విలీనంపై నిరసనలు ద్వారంపూడి కారును ఆపి.. ఘెరావ్

‘అమ్మఒడి మాకొద్దు’ అంటూ నినాదాలు..

 గంటపాటు చిక్కుకున్న ఎమ్మెల్యే

 అప్పటికప్పుడు డీఈవోను పిలిచి చర్చలు సీఎం దృష్టికి తీసుకువెళతానని హామీ

పాఠశాలలను కొనసాగిస్తాం సేక్రెడ్ హార్ట్, సెయింట్ పీటర్స్ లేఖ

కాకినాడ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ఎయిడెడ్ సెగ రాష్ట్రమంతా తగులుతోంది. ఎక్కడిక క్కడ విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుకు నిర సనగా ఆదికార ఎమ్మెల్యేలను నిలేస్తున్నారు. విశాఖ బాటలోనే కాకినాడలోనూ ఎయిడెడ్ విద్యాసంస్థలో చదివే పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాల విలీనంపై ప్రత్యక్ష ఆందోళ నకు దిగారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని దాదాపు గంట సేపు ఘెరావ్ చేశారు. పాఠశాల మూసివేత పై ఎమ్మెల్యేను చుట్టుముట్టి, ధాటిగా ప్రశ్నిస్తూ, ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నా ధపురంలో సెయింట్ ఆన్స్ బాలికోన్నత ఎయిడెడ్ పాఠ శాల నలబై ఏళ్లకుపైగా నడుస్తోంది. ఇప్పుడు ఈ పాఠ శాలను ప్రభుత్వం విలీనం చేయాలని నిర్ణయించింది. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ ఉద్దేశం తెలిపేందుకు స్కూలు యాజమాన్యం ప్రత్యేక సమా వేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వందలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. వారం ఉదయం 11 గంటలకు స్కూలు వద్దకు వచ్చారు.

 యాజమాన్యం నిర్ణయం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇదే సమయంలో ఓ ప్రైవేటు కార్యక్రమా నికి హాజరయ్యేందుకు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అటువైపు వెళ్తున్నారు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. గంటకుపైగా ఆయనను ఘెరావ్ ఆక్రోశం, ఆగ్రహం కలగలిసి ప్రశ్నలతో ద్వారం పూడిని నిలేశారు. ఇన్నేళ్లలో రూపాయి కూడా తీసుకో కుండా చదువు చెబుతున్న సెయింట్ ఆన్స్ బాలికో న్నత పాఠశాలను తమకు దూరం చేయొద్దు అని డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియలో భాగంగా ఎయి డెడ్ నిధులు నిలిపివేతతో రూ.15 వేలు ఫీజు కట్టమం టున్నారని ప్రభుత్వానికి ఇది న్యాయమేనా అంటూ నిలదీశారు

Flash...   వాట్సాప్‌ 'Chat Thread' ఎలా పనిచేస్తుందో తెలుసా?