అత్యంత సంప‌న్న దేశంగా చైనా.. అమెరికా కిందకు


న్యూయార్క్‌: అమెరికా, చైనా మ‌ధ్య గ‌త కొన్నాళ్లుగా వాణిజ్య పోరు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అమెరికాకు షాకిచ్చే రీతిలో మ‌రో సంచ‌ల‌నం న‌మోదు అయ్యింది. ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న దేశంగా డ్రాగ‌న్ దేశం చైనా ఆవిర్భ‌వించింది. అగ్ర‌రాజ్యం అమెరికాను వెన‌క్కి నెట్టేసి చైనా.. సంప‌ద సృష్టిలో ముందుకు దూసుకెళ్తోంది. గ‌డిచిన రెండు ద‌శాబ్ధాల్లో ప్ర‌పంచవ్యాప్తంగా సంప‌ద మూడింత‌లు పెరిగిన‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. దాంట్లో క‌మ్యూనిస్టు చైనా ముందంజ‌లో ఉన్న‌ట్లు తేల్చారు. టాప్ స్పాట్‌లో ఉన్న అమెరికాను వాళ్లు వెన‌క్కి నెట్టేశారు. దీనికి సంబంధించిన నివేదిక‌ను మెకెన్సీ అండ్ కంపెనీ త‌యారు చేశారు.

ప‌ది అగ్ర‌దేశాల జాతీయ బ్యాలెన్స్ షీట్ల‌ను ప‌రిశీలించిన ఆ ఏజెన్సీ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. మెక‌న్సీ కంపెనీ ప్ర‌కారం ఆ ప‌ది దేశాల వ‌ద్ద ప్ర‌పంచంలోని సుమారు 60 శాతం సంప‌ద ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, మెక్సికో, స్వీడ‌న్‌లు ఉన్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఇప్పుడు మ‌నం సంప‌న్నుల‌మ‌య్యామ‌ని జూరిచ్‌లోని మెక‌న్సీ గ్లోబ‌ల్ ఇన్స్‌టిట్యూట్ భాగ‌స్వామి జాన్ మిచ్‌కి తెలిపారు.

మెక‌న్సీ ఏజెన్సీ నివేదిక ప్ర‌కారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2020లో సంప‌ద 514 ట్రిలియ‌న్ డాల‌ర్ల నుంచి 156 ట్రిలియ‌న్ల డాల‌ర్లుకు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. దాంట్లో ఒక్క చైనాలోనే సంప‌ద మూడో వంత పెరిగిన‌ట్లు తేల్చేశారు. 2000 సంవ‌త్స‌రంలో ఏడు ట్రిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న చైనా సంప‌ద ఇప్పుడు 120 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌లో చైనా చేరిన త‌ర్వాత ఆ దేశ సంప‌ద దూసుకెళ్తున్న‌ట్లు మెక‌న్సీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. మ‌రో వైపు అమెరికాలో ప్రాప‌ర్టీ విలువ‌లు పెరిగినా.. ఆ దేశ సంప‌ద 90 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే రెండు దేశాల్లోనూ ప‌ది శాతం సంద‌ప‌న్న సంప‌న్నుల వ‌ద్దే ఉన్న‌ట్లు గుర్తించారు. అమెరికా, చైనాలో ఉన్న సంప‌న్నుల షేర్లు కూడా శ‌ర‌వేగంగా వృద్ధి చెందుతున్న‌ట్లు రిపోర్ట్‌లో వెల్ల‌డించారు.

Flash...   INDIA లో కాస్త తగ్గిన కరోనా కేసులు..24 గంటల్లో

మెక‌న్సీ కంప్యూట‌ర్ నివేదిక ప్ర‌కారం.. ప్ర‌పంచ వ్యాప్తంగా 68 శాతం నిక‌ర సంప‌ద మొత్తం రియ‌ల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్న‌ది. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, మెషిన‌రీ, ఎక్విప్మెంట్, ప్రాప‌ర్టీ, పేటెంట్స్ లాంటి వ‌ద్ద కొంత బ్యాలెన్స్ సంప‌ద ఉన్న‌ట్లు గుర్తించారు.