నేడు మరో అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు!

 Weather Update: నేడు మరో అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు!


Weather Update: నవంబర్ నెల మొదలైన దగ్గర నుండి ఏపీలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాయుగుండం, అల్పపీడనం, తుఫాన్ ఇలా ఏదోకటి ఏర్పడుతూనే దాదాపు 20 రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత రెండు రోజులుగా కాస్త తెరపి ఇచ్చిన వర్షాలు శుక్రవారం నుండి మళ్ళీ మొదలవుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో నేడు(గురువారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది

ఇది శ్రీలంక- దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26, 27, 28 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చునని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశముందని వెల్లడించింది


ఈ అల్పపీడనం మరింత బలపడి 26న తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

Flash...   Jio: ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు.. జియో వార్షిక ప్లాన్‌ జాబితా ఇదే..