సెలవు చీటీ గాలికి ఎగిరిపోయిందట..ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు

• హైస్కూల్లో తనిఖీ

• ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంపై ఆగ్రహం

•సెలవు పెట్టాడు, సెలవు చీటి గాలికి పోయిందన్న ఉపాధ్యాయులు 

• ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు 

శింగరాయకొండ (PRAKASAM DT.)

మండల పరిషత్ పాశింగరాయకొండ హైస్కూల్ను శనివారం కందుకూరు డిప్యూటీ డిఇఒ ఎస్.సుబ్బారావు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ వెళ్ళగానే పిల్లలందరూ బయటే 9-30 గంటలకు ఉండటం తో అక్కడ ఉన్న ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఎక్కడ అని అక్కడ ఉన్న ఉపాధ్యాయులను అడగగా సెలవులో ఉన్నాడని చెప్పారు. సెలవు చీటి ఏది అని అడగ్గా సెలవు చీటి గాలికి పోయిందని ఉపాధ్యాయులు సమాధానం ఇచ్చారు. దీనిపై అక్కడ ఉన్న ఉపాధ్యాయులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే జిల్లా పరిషత్ హైస్కూల్గా ఉన్న ఈ పాఠశాలను ఇంత భ్రష్టు పట్టిస్తారా మండిపడ్డారు. అంటూ ఉపాధ్యాయులపై ప్రధానోపాధ్యాయుడు రాకుండానే  సెలవు పెట్టాడని చెప్పి, ఆ సెలవు చీటి గాలికి పోయిందని చెప్తారా అంటూ విధులలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు ప్రధానోపాధ్యాయుడు రాఘవరావుకు మెమోను ఇచ్చారు. 

అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించగా ఏ ఒక్క రికార్డు సక్రమంగా లేదని, ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ విధంగా జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో సమావేశమై ఇటీవల జరిగిన పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ పాఠశాలలో  ప్రధానోపాధ్యాయుడు NS సబ్జెక్టు చెప్తుంటాడు. ప్రతి ఒక్క విద్యార్థి ఆ సబ్జెక్ట్ను సక్రమంగా చెప్పడం లేదని, నోడ్సులు ఖాళీగా ఉన్నాయని, పరీక్షలు జరిగిన ఆ పేపర్లో ఎన్నిమార్కులు వచ్చాయో తమకు తెలియదని విలేకర్ల ముందు విద్యార్థులు వాపోయారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పనితీరుపై విద్యాశాఖ అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టకపోవడం వలనే ఈ విధంగా జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. వీరి వెంట మండల విద్యాశాఖాధికారి బి. శివన్నారాయణ, మర్రి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. అనంతరం ఊళ్ళపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ను కూడా డిప్యూటీ డిఇఒ తనిఖీ చేశారు.

Flash...   ENGLISH SPELL TEST 2