ప్రధానోపాధ్యాయులకు నోటీసులు

➤  ప్రధానోపాధ్యాయులకు నోటీసులు

➤  పాఠశాలలకు సకాలంలో అందని కోడిగుడ్లు

➤  విద్యార్థులకు ఎందుకివ్వలేదంటూ పాఠశాల విద్యాశాఖ షోకాజ్ నోటీసులు

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వం పాఠశాలలకు గుత్తేదారుల నుంచి కోడిగుడ్లు, చిక్కిలు సరఫరా కాకపోయినా.. సాంకేతిక కార లతో మధ్యాహ్న భోజన పథకం యాప్ నివ నాలు నమోదవకున్నా. పాఠశాల విద్యాశాఖ ప్రధానోపాధ్యాయుల్నే బాధ్యుల్ని చేస్తోంది. మధ్యా హృభోజన పథకంలో భాగంగా కోడిగుడ్లు. చెక్కిలు అందించలేదని పలు జిల్లాల్లోని పాఠశా ల ప్రధానోపాధ్యాయులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. యాప్ నమోదైన వివరాలనే ప్రామాణికంగా తీసుకుని వివరణ ఇవ్వాలని అనే కంచింది. విద్యార్థులకు గుడ్లు, చిక్కిలు రదు, మధ్యాహ్న బోటను వివరాలు యాప్ నమోదు చేయడంపై పటమారు హెచ్చరించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. 

కడప జిల్లాలోని వేముల జడ్పీ పాఠశాలలో గుత్తేదారు సరఫరా చేసిన కోడిగుడ్లు అక్టోబర్   28న అయిపోయాయి. దీనిపై ప్రధానో పాధ్యాయుడు గుత్తేదారును సంప్రదించగా సోమవారం పంపిస్తామన్నారు. ఈలోపే విద్యార్థులకు కోడిగున్న ఇవ్వలేదని పాఠశాల విద్యాశాఖ ప్రధానోపాధ్యాయుడికి షోకాట్ చోటీసు జారీచేసింది. కడప జిల్లాలోని పలు పాఠశాలల్లో చిక్కిల విషయంలోనూ ఇదే పరిస్థితి.

గుత్తేదారు ఇవ్వకపోతే ఎలా?

గుడ్లు, చిక్కిలను గుత్తేదారులు సకాలంలో పంపిణీ చేయకపోతే విద్యార్థులకు ఎలా ఇస్తామని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లను వదిలేసి తమను బాధ్యుల్ని చేయడమేంటని మండిపడ్డారు. ఒకోసారి గుర్తు చిక్కీలు అందించినా సాంకేతిక కావణాలతో యాప్ నమోదు కావట్లేదని, దీనిపై నోటీసులు ఇవ్వడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాల మనిక ఆదివారం లేఖ రాశాడు.

నేడు ఆందోళన…

నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం కడపలోని పాఠశాల విద్య ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఎస్టీయూ ఆధ్వర్యంలో నాలుగు జిల్లాల నాయకులు ఆందోళన చేపట్టను న్నట్లు చిత్తూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యద కులు మురళి, జగన్మోహన్ రెడ్డి ఆదివారం సాయంత్రం చిత్తూరులో ప్రకటించారు.
Flash...   Orientation on Conduction of Base Line Test on 20.07.2022 @ 2.30 PM