శీతాకాలంలో చర్మం పొడిబారుతుందా..! ఇలా ట్రై చేయండి.

 శీతాకాలంలో చర్మం పొడిబారుతుందా..! మేక పాలను ఇలా ట్రై చేయండి.

Dry Skin Care Tips in Winter – Goat’s Milk: శీతాకాలంలో పొడిబారిన చర్మంతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. ఎన్ని క్రీములు వాడిని ఫలితం సరిగ్గా ఉండదు. తాత్కాలికంగా ఉపశమనం కల్పించినా దీర్ఘకాలికంగా ఈ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. పగిలిన చర్మంతో బయటికి రాలేకపోతారు అలాంటి సమయంలో సహజ గుణాలున్న మేకపాలని ఉపయోగిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఏమి ఉండవు. అయితే వీటిని ఎలా ఉపయోగించాలో మన “లైఫ్ స్టైల్” లో తెలుసుకుందాం.

ప్రస్తుతం మేక పాలని చాలామంది ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చలి కాలంలో ఇవి మీ చర్మాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచుతాయి. కఠినమైన డెడ్‌సెల్స్‌ని తొలగిస్తాయి. ఉత్తమ ఫలితాల కోసం స్నానం చేసిన తర్వాత మేకపాలని అప్లై చేయాలి. ఈ పాలలో ఉన్న కొవ్వు ఆమ్లాలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. మేక పాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి.

మేక పాలలో ఉండే విటమిన్ ఎ, ఈ దెబ్బతిన్న చర్మాన్ని బాగు చేయడంలో సహాయపడుతాయి. చనిపోయిన చర్మాన్ని వదిలించుకోవడానికి మీ చర్మానికి ఎక్స్‌ఫోలియేషన్ అవసరం. గంటల తరబడి స్క్రబ్బింగ్ చేయడం వల్ల మీకు నష్టం కలగవచ్చు. అలాంటప్పుడు మేక పాలని ఉపయోగిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్, ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్‌గా పని చేస్తుంది. ఇది మీ చర్మంపై ఉండే మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మేకపాలు జుట్టుకి కూడా బాగా ఉపయోగపడుతాయి.

Flash...   నెలకు రూ.2 లక్షలు పెన్షన్ కావాలా..?? ఇలా ప్లాన్ చేసుకోండి..