AP: ప్రజలపై మరో పన్ను బాదుడు.. అసెంబ్లీలో బిల్


అమరావతి: రాష్ట్రంలో ప్రజలపై మరో పన్ను బాదుడుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మోటారు వాహ‌నాల ప‌న్ను చ‌ట్టం 1963లో స‌వ‌ర‌ణ‌లకు అసెంబ్లీలో బిల్ ప్రవేశ పెట్టారు. వాహ‌నాల లైఫ్‌టాక్స్, గ్రీన్‌టాక్స్ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నూత‌న వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో… ఇక‌పై 13, 14, 17, 18 శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్యాక్సుల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై 410 కోట్ల అద‌న‌పు భారాన్ని ప్రభుత్వం మోపనుంది. 2019-21లో ర‌వాణా శాఖ‌కు రూ. 3,181 కోట్ల ఆదాయం లభించింది. 

అయితే వాహ‌న మిత్ర పేరుతో కొద్ది మందికే ప‌థ‌కం వర్తించింది. టాక్స్‌ల పెంపుతో ల‌క్ష‌ల‌ మందిపై వంద‌ల కోట్ల భారం మోపనుంది. రాష్ట్రంలో ఇప్ప‌టికే కోటి 31 ల‌క్ష‌ల వాహ‌నాలు – 1.15 కోట్ల ర‌వాణాయేత‌ర వాహ‌నాలున్నాయి. 2010లో చివ‌రి సారిగా ప‌న్నుల్లో స‌వర‌ణ‌ చేయనున్నారు. ర‌హ‌దారుల నిర్మాణం, మౌలిక స‌దుపాయాల్లో ర‌వాణా శాఖ ఆదాయ‌మే కీలకమని ప్ర‌భుత్వం భావిస్తోంది. ద్ర‌వ్యోల్బ‌ణం, ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌, కాలుష్య నియంత్ర‌ణ కోసం టాక్స్‌లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Flash...   Kitchen Tips: ఫ్రిడ్జ్ లో ఇవి పెడుతున్నారా.. పొరపాటున కూడా అలా చేయకండి!