AP మూడు రాజధానుల కేసు.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

 ఏపీ మూడు రాజధానుల కేసు.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ.


మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఇప్పటికే హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైందని… ఈ సమావేశంలో మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కోర్టుకు విన్నవించారు. అయితే, రాజధాని కేసులపై సోమవారం విచారణ చేపట్టనుంది హైకోర్టు ధర్మాసనం.

ఇక, ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయడం.. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును అఫిడవిట్‌కు జత చేసి హైకోర్టుకు ఇచ్చింది వైఎస్‌ జగన్‌ సర్కార్.. బిల్లు కాపీలతోపాటు.. అసెంబ్లీ, మండలిలో జరిగిన ప్రొసీడింగ్స్‌ కాపీలను కోర్టుకు సమర్పించింది ప్రభుత్వం.. రూల్‌ 123 ప్రకారం అసెంబ్లీలో, రూల్‌ 147 ప్రకారం మండలిలో రద్దు బిల్లు ఆమోదం పొందిందంటూ స్పీకర్‌ తమ్మినేని, మండలి ఛైర్మన్‌ మోషేన్‌ రాజు సంతకాలతో కూడిన మెసేజ్‌ కాపీలని కూడా కోర్టుకు సమర్పించింది ప్రభుత్వం.. అయితే, విచారణ కొనసాగింపుపై హైకోర్టు ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.

Flash...   Deputation of Senior Assistants /Junior Assistaqnts /Typists to RJDSE/DEOs/SCERT