Cyclones: తుఫాన్‌లు ఎలా ఏర్పడతాయి? అల్పపీనడం, వాయుగుండం మధ్య తేడా ఏంటి.. తీరం దాటడం అంటే?
తుఫాన్.. ఈ పేరు వింటే చాలు వెన్నులో వణుకుపుడుతుంది. ఈ తుఫాన్లు జీవితాలను ఛిన్నాబిన్నం చేస్తాయి. ప్రాణాలను హరిస్తాయి. పంటలను దెబ్బతీస్తాయి. తుఫాన్ల కారణంగా విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. అయితే, ఈ తుఫాన్లు ఎలా ఏర్పడతాయి?.. అల్పపీడనం, వాయుగుండం అంటే ఏమిటి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…
ఎక్కువగా గాలులు ఉండే ప్రాంతాన్ని అధిక పీడనం అంటారు. అతి తక్కువ గాలులు ఉంటే దాన్ని అల్పపీడనంగా పిలుస్తారు. గాలుల కదలికలో మార్పుల వల్లే ఈ రెండు పీడనాలు ఏర్పడతాయి. గాలుల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అవి వేడి గాలి, చల్లగాలి. ఈ గాలులు భూమ్మీద, సముద్రాల మీద వ్యాపించి ఉంటాయి. వేడిగాలి తేలికగా ఉండి పైకి చేరుతుంది. చల్లగాలి నీటి తేమ కారణంగా భూ ఉపరితలం మీద ఉంటుంది. సముద్ర ఉపరితం వేడెక్కడం వల్ల చల్లగాలిలోని తేమ ఆవిరై.. గాలులు వేడెక్కి.. తేలికగా మారి పైకి చేరుతాయి. గాల్లో ఉండే నీటి ఆవిరి కూడా పైకి చేరి ఘనీభవించి మంచు స్పటికాలుగా మారుతుంది. ఆపై దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. ఎక్కువ మొత్తంలో గాలులు పైకి చేరడం వల్ల కింద ఖాళీ ఏర్పడుతుంది. దాన్నే అల్పపీడనం అంటారు. అంటే గాలులు తక్కువ ఉన్న ప్రదేశం అని అర్థం. ఈ క్రమంలో చుట్టూ ఉన్న గాలులు అల్పపీడనం వైపు వీస్తాయి. ఆ వీచే గాలులతో పాటు మేఘాలు కూడా పయనించి..చల్లబడి వర్షాలుగా కురుస్తాయి. ఆ గాలుల మొత్తం ఇంకా ఎక్కువ ఉంటే.. అల్పపీడనం ఉన్నచోట గాలులన్నీ కలిసి ఒక వలయాకారంలో తిరుగుతూ ఉంటాయి. పైన ఉన్న మేఘాల నుంచి వర్షాలు కూడా కురుస్తాయి. మొత్తంగా అల్పపీడనం మరింత తీవ్రమైతే వాయుగుండంగా మారుతుంది. అది మరింత బలపడితే తుఫాన్‌గా వృద్ది చెందుతుంది
సముద్రంలో వేడెక్కిన నీటి ఆవిరిని… తుఫాన్లు సంగ్రహిస్తాయి. సముద్రంలో ఏర్పడే సుడుల వల్ల చల్లబడి… దట్టమైన మేఘాలుగా ఏర్పడి తుఫాన్‌తో కలిసి ట్రావెల్ చేస్తాయి. సముద్రంలో సుడులు రూపంలో ఉండే తుఫాన్.. భూ వాతావరణంలోకి ఎంటరవ్వడన్నే తీరాన్ని తాకడం అంటారు. తుఫాన్ భూ ఉపరితలాన్న తాకగానే సుడులు రూపంలో ఉన్న మేఘాలు విచ్చిన్నమై భారీ వర్షాలు కురుస్తాయి. సుడులకు కారణమైన గాలులు తీరం పైకి గంటకు 61 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణించగలవు.
తుఫాన్ ‘కన్ను’
తుఫాన్‌లో ఏర్పడే ‘కన్ను’ చాలా డేంజరస్ అని చెప్పాలి. తుఫాన్ సుడిలో ఉండే అతిపెద్ద సూన్య ప్రదేశమే కన్ను. ఇందులో మేఘాలు ఉండవు, గాలి ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కన్ను భూమిపైకి రాగానే సెక్లోన్ ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది. అయితే, అది తీరాన్ని దాటిన తర్వాత తుఫాన్ ఎఫ్‌క్ట్ మళ్లీ కొనసాగుతుంది.