Horoscope Today: నవంబరు 25 దినఫలాలు.. ఈ రాశుల వారు జాగ్రత్త.. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు


మేషం (Aries)
(అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పరవాలేదు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.

వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్లవద్దు.

మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.మ ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు.

కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగా పెరుగుతాయి. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదుర వుతాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరుగుతాయి. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తల పెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో సహోద్యోగుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

Flash...   Big Alert: కొత్త ఏడాదిలో షాకివ్వనున్న గ్యాస్ ధరలు?

తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటా యి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అంది అవసరాలు తీరతాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఆస్తి విషయంలో సమీప బంధువులు బాగా ఇబ్బంది పెడతారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అ వుతాయి. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి. స్నేహితులతో హాయిగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చ కపోవడం మంచిది.

మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆర్థికంగా మంచి కాలం నడుస్తోంది. మీ నిర్ణయాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. కొత్త సంస్థ నుంచి ఆఫర్లు వస్తాయి. రావనుకున్న బాకీలు వసూలవుతాయి. ఆ దాయంలో పెరుగుదల కనిపిస్తోంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు ఆర్థికంగా లాభం పొందుతారు. ఎంతో శ్రమపడి పనులు పూర్తి చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరిఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సన్నిహితులు అండగా నిలబడతారు.

మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో గానీ, స్నేహితులతో గానీ సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి 

Flash...   UPSC ESE 2024 Notification: కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజనీరింగ్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా‌..