Inspiring Teacher: ఇలాంటి టీచర్ కోటికి ఒక్కరే ఉంటారు.. స్టూడెంట్స్ చదువుల కోసం సొంత నగలు అమ్మేసిన ఉపాధ్యాయురాలు.
మిస్సైల్ మెన్ అబ్దుల్ కలాం .. ఉపాధ్యాయ వృత్తిని గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ విషయాన్నీ తమిళనాడుకు చెందిన ఓ టీచర్ ను ఆకట్టుకుంది. అంతేకాదు విద్యార్థులోని నైపుణ్యాన్ని గుర్తించి భవిష్యత్తును రూపొందించే గొప్ప వృత్తి ఉపాద్యాయ వృత్తి. తమిళనాడు పాఠశాలో ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి తన ఆభరణాలను కూడా అమ్మేశారు. ఈరోజు ఆ ఇన్స్పైరింగ్ పర్సన్ గురించి తెలుసుకుందాం..
తమిళనాడులోని పంచాయతీ యూనియన్ ప్రైమరీ స్కూల్ కందాడులోని ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో అన్నపూర్ణ మోహన్ టీచర్ గా విధులను నిర్వహిస్తున్నారు. ఆమె 3వ తరగతి విద్యార్థులకు పాఠాలను బోధించేవారు. తమిళం మినహా మిగిలిన సబ్జెక్ట్స్ ను ఇంగిలీషు లోనే బోధన జరుగుతుంది. అయితే అన్నపూర్ణ తన స్టూడెంట్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్ లో విద్యార్థుల మాదిరిగా ఇంగ్లీషులో మాట్లాడలని భావించింది. అందుకు అనుగుణంగా అంతర్జాతీయ పాఠశాలల్లో విద్యార్థులకు బోధించే పద్ధతిలోనే తన స్టూడెంట్స్ కు పాఠాలు చెబుతుంది.
అయితే అంతర్జాతీయ స్థాయిలో బోధన చేయడానికి తగిన విధంగా తమ స్కూల్ లో సౌకర్యాలు లేవని అన్నపూర్ణ గుర్తించింది. దీంతో తన విద్యార్థులతో ఇంగ్లిష్ పద్యాలు, పాటలు పాడిస్తూ వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలు పెట్టారు. దీంతో అన్నపూర్ణ ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు సంతోష పడ్డారు. అంతేకాదు ఆమెకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. విద్యార్థుల వీడియోను చూసి ఒక ఉపాధ్యాయుడి నుండి ప్రశంసాపూర్వకంగా ఆర్ధిక సాయం చేశారు. అలా అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లోని ఎన్నారైలు అన్నపూర్ణకు అండగా నిలబడ్డారు. ఆర్ధిక సాయం అందించడం మొదలు పెట్టారు. దీంతో ఎక్కడెక్కడివారో తనకు డబ్బులు పంపిస్తున్నారు. మరి నా స్టూడెంట్స్ కోసం నేను ఏమి చేస్తున్నా అని తనలో తానే ఆలోచించి.. తన దగ్గర ఉన్న నగలు అమ్మేసింది. అలా వచ్చిన డబ్బులతో స్టూడెంట్స్ చదువుకోవడానికి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసింది. తన స్టూడెంట్స్ చదువుకునే తరగతి గదిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దింది. స్కూల్‌లో అధునాతన డిజిటల్ సిస్టమ్, విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు అవసరమయ్యే డిజిటల్ పరికరాలు వంటి వాటిని సమకూర్చింది.
భారత విద్యా విధానంలో మార్పు:
భారతదేశంలోని విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావాలని అన్నపూర్ణ చెబుతారు. “భారతదేశం అంతటా లేదా కనీసం రాష్ట్రంలోనైనా ఒకే విధమైన విద్యావిధానం ఉండాలని.. తద్వారా అర్హులైన విద్యార్థులందరికీ మంచి అవకాశాలు లభిస్తాయి” అని అన్నపూర్ణ అంటారు.
తమ టీచర్ తమ కోసం తీసుకుంటున్న కేరింగ్ ను కష్టాన్ని స్టూడెంట్స్ అర్ధం చేసుకున్నారు. చదువులో రాణిస్తూ కార్పొరేట్ స్కూల్స్ లో చదివే స్టూడెంట్స్ కు ధీటుగా ఇంగ్లీషులో మాట్లాడతారు. సమాజం కోసం తనకు ఉన్నదానిని వినియోగించే అన్నపూర్ణ లాంటి టీచర్స్ ను ఎన్నిసార్లు అయినా తలుచుకోవచ్చు. ఎన్ని ఏళ్ళు అయినా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అన్నపూర్ణ మోహన్ వంటి ఉపాధ్యాయులు కోటి మందికి ఒక్కరుంటారు.