LPG GAS సిలెండర్ వాడే వారికి అలర్ట్..!

LPG GAS సిలెండర్ వాడే వారికి అలర్ట్..!


గ్యాస్ సిలెండర్ ని అందరి ఇళ్లల్లో ఎక్కువ వాడుతుంటారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం అయితే ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1000కి దగ్గరగా వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మరో సారి గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగేలా కనపడుతోంది. రూ. 1000కి పైనే చెల్లించాల్సి ఉంటుంది.

ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త రూల్ ని తీసుకు రావాలనే ఆలోచనలో వుంది. అయితే ప్రస్తుతం వచ్చిన నివేదికల ప్రకారం చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అంశానికి సంబంధించి మోదీ సర్కార్ రెండు విధానాలపై దృష్టి పెట్టినట్టు అర్ధం అవుతోంది. అయితే మొదట గ్యాస్ సబ్సీడీ విషయంలో మార్పు చేయనుంది.

గ్యాస్ సబ్సిడీ లేకుండానే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు కొనుక్కోవాలి. అలానే రెండవది ఏమిటంటే ఎంపిక చేసిన వినియోగదారులకి మాత్రమే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అందించడం జరుగుతుంది. ఇలా ఈ మార్పులను చేయనుంది కేంద్రం.

ఇది ఇలా ఉంటే వీటిపై ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే కొంత సబ్సిడీ వస్తోంది. ఇవి డైరెక్ట్ గా వినియోగదారుల అకౌంట్ లో పడతాయి. రూ.10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం కలిగిన వారికి ఎల్‌పీజీ సబ్సిడీ పడవు.

Flash...   GO MS 199 Child Care leave modification - Enhancement of Maximum spells to 10